సాధారణంగా భార్యను భర్తలు హత్య చేసిన ఘటనలు ఎక్కువగా చూస్తుంటాం.. కానీ, పరిస్థితులు మారిపోయాయి.. భార్తలే భర్తలను దారుణంగా హత్య చేసిన ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి.. జనగామ జిల్లాలో భర్తను దారుణంగా చంపింది భార్య. తండ్రి, మైనర్ కొడుకుతో కలిసి భర్త కళ్లల్లో కారం కొట్టి కత్తితో దాడిచేసింది. ఈ ఘటనలో భర్త అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. హైదరాబాద్‌లోని పార్షిగుట్టకు చెందిన హనుమాండ్ల వినోద్, జనగామలోని అంబేద్కర్ నగర్‌లో నివాసముంటున్న మంజులను రెండేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవ కారణంగా మంజుల తన కొడుకుతో పుట్టింటికి వెళ్లింది. అత్తవారింటికి వెళ్లిన వినోద్ మద్యం మత్తులో భార్య కుటుంబ సభ్యులతో గొడవకు దిగాడు. ఆ గొడవ కాస్త దాడి చేసుకునే పరిస్థితికి చేరుకుంది. భార్య మంజుల, తండ్రి, తన మైనర్ కుమారుడు కలిసి వినోద్ కళ్లల్లో కారం చల్లి కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన అత్తింటి ముందు కుప్పకూలాడు. అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.. ఇక, స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఈ దారుణంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also: Ukraine Russia War: రష్యాకు షాక్ ఇచ్చిన మరో కీలక సంస్థ..!