ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య పొలిటికల్ రంగు పులుముకుంది. నిన్న సాయిగణేష్ అనే వ్యక్తి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. అయితే ట్రిట్మెంట్ తీసుకుంటూ ఇవాళ చనిపోయాడు. అతడి మృతివకి టీఆర్‌ఎస్ నేతలు, పోలీసుల వేధింపులే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. సాయిగణేష్ బీజేపీ మజ్దూర్ సంఘం జిల్లా అధ్యక్షుడు.. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని… దాంతో తీవ్ర మనస్థాపంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు ఆరోపిస్తున్నారు.
Read Also: Dharmana: మంత్రి ధర్మాన ఆసక్తికర వ్యాఖ్యలు.. కేవలం నిజాయితీవల్లే సాధ్యం..!
బీజేపీ ఎదుగుదలను జీర్ణించుకోలేక ఆపే ప్రయత్నంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన మరో హత్య అని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.. ఖమ్మం జిల్లా సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉన్నందుకు మంత్రి పువ్వాడ అజయ్ అండతో అక్రమ కేసులు మరియు రౌడీ షీట్ పెట్టి మజ్దూర్ సెల్ అధ్యక్షుడు, బీజేపీ చురుకైన కార్యకర్త సామినేని సాయి గణేష్‌ని పోలీసులు వేధించారని.. మనస్తాపానికి గురై మూడు రోజుల క్రితం 14వ తేదీన ఖమ్మం పోలీస్ స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నం చేయగా.. ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతిచెందినట్టు చెబుతున్నారు.. ఇక, ఖమ్మం వెళ్లనుంది బీజేపీ ప్రతినిధుల బృందం.. సాయి గణేష్ ఆత్మ హత్య నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీలు రామచందర్‌రావు, దిలీప్ కుమార్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఖమ్మం వెళ్లనున్నారు.. మంత్రి పువ్వాడనే సాయి గణేష్ ఆత్మహత్యకు కారణం అని మండిపడుతున్నారు.