KCR behind PK: కేసీఆర్ భేటీ తర్వాత మారిన పీకే మనస్సు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతా అయిపోయింది.. ఇక, కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే తరువాయి.. వరుస ఓటములు చూస్తోన్న హస్తం పార్టీ.. గాడిలో పడుతోంది.. పూర్వ వైభవం వస్తుంది.. అంటూ అనేక విశ్లేషలు వచ్చాయి.. ఇలా ఈ మధ్య చర్చ మొత్తం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే గురించే జరిగింది.. కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పుల కోసం కీలక సూచనలు చేసిన ఆయనను.. పార్టీలో చేర్చుకోవడంపై సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చింది. కొందరు నేతలు వ్యతిరేకించినా.. కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ సోనియా గాంధీ.. పీకేను ఆహ్వానించడం.. ఆయన సున్నితంగా తిరస్కరించడం జరిగిపోయాయి.. అయితే, కాంగ్రెస్ ఆఫర్‌ను పీకే తిరస్కరించడం వెనుక గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహం ఏమైనా పనిచేసిందా? అనే కొత్త చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది.
Read Also: Prashant Kishor: అందుకే కాంగ్రెస్‌లో చేరడంలేదు.. క్లారిటీ ఇచ్చిన పీకే
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
- Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
కాంగ్రెస్ అధిష్టానానికి టచ్‌లోకి వెళ్లకముందే.. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు పీకే.. రాష్ట్రంలో మరోసారి టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి వ్యూహాలు అందించేందుకు సిద్ధం అయ్యారు.. అందులో భాగంగా.. సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌తో కలిసి ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులను కూడా పరిశీలించారు. సర్వే కూడా నిర్వహించి కీలక సూచనలు చేశారు. తాము పీకేతో కలిసి పనిచేస్తున్నామంటూ సీఎం కేసీఆర్ కూడా బహిరంగంగా ప్రకటించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. కాంగ్రెస్ అధిష్టానంతో పీకే వరుస భేటీల తర్వాత పరిస్థితి మారిపోయినట్టు కనిపించింది.. పీకే కాంగ్రెస్‌లో చేరడం ఖాయమనే చర్చ సాగింది.. అయితే, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న ఏ పార్టీతో వ్యవహారాలు నడపవద్దని.. అన్ని తెంచుకోవాల్సిందేనంటూ హైకమాండ్ పీకేకు షరతులు విధించినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇక్కడే కీలక పరిణామం చోటు చేసుకుంది..
ఈ మధ్యే హైదరాబాద్ వచ్చిన ప్రశాంత్ కిషోర్.. ప్రగతి భవన్‌లో మకాం వేశారు.. వరుసగా రెండు రోజుల పాటు గులాబీ దళపతి కేసీఆర్‌తో సుదీర్ఘ మంతనాలు నెరిపారు.. ఈ భేటీయే పీకే మనస్సు మార్చిందా? అనే చర్చ సాగుతోంది.. పీకేతో కలిసి నడిచేందుకు పిక్స్ అయిన కేసీఆర్.. కాంగ్రెస్‌లో ఉండే పరిస్థితులు.. అందులో చేరితే ఉండే ఇబ్బందులు.. ఇలా అనేక విషయాలను కూడా పీకేతో చర్చించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఓవైపు టీఆర్ఎస్‌తో తెగదెంపులు చేసుకోవడానికే పీకే హైదరాబాద్ వచ్చాడని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్న సమయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.. తెలంగాణ నుంచి వెళ్లిన రెండు మూడు రోజుల్లోనే తాను కాంగ్రెస్ ఆఫర్‌ను తిరస్కరించినట్టు పీకే ప్రకటించడం వెనుక.. కేసీఆర్ వ్యూహం ఉందనే చర్చ సాగుతోంది.
తాజావార్తలు
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
ట్రెండింగ్
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?