TS Group-1 Notification: తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది.. వరుసగా నోటిఫికేషన్లు వస్తున్నాయి.. ఇప్పటికే పోలీసు విభాగంలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా.. ఇవాళ గ్రూప్ – 1 నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ). తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే తొలి గ్రూప్ -1 నోటిఫికేషన్ కావడం విశేషం.. మొత్తం 503 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి. ఇటీవలే గ్రూప్స్ పరీక్షల విధానాన్ని విడుదల చేసిన ప్రభుత్వం.. గ్రూప్ వన్‌లో ఇంటర్వ్యులను రద్దు చేసిన విషయం తెలిసిందే.. ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారానే గ్రూప్ -1 పోస్టులను భర్తీ చేయనున్నారు. మెయిన్స్ లో వచ్చిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయబోతున్నారు..
Read Also: Vaccination: 6 – 12 ఏళ్ల చిన్నారులకు వ్యాక్సిన్.. డీజీసీఐ అనుమతి..
Also Read
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
- OTR: కేంద్రమంత్రి పెమ్మసాని పై తెలంగాణ బీజేపీ ఎంపీలు అసహనం .. అసలు కారణమేంటి ?
- TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది టీఎస్పీఎస్సీ.. మే 2 నుండి మే 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇక, జులై / ఆగస్టులో ప్రిలిమినరీ, నవంబర్ / డిసెంబర్‌లో మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు.. కాగా, గ్రూప్ వన్ దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటే మొదట టీఎస్పీఎస్సీ వెబ్ సైట్‌లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.. ఇంతకు ముందే ఓటీఆర్ చేసుకున్నవారు అప్‌గ్రేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 42, డీఎస్పీ 91, సీటీవో 48, ఎంపీడీవోలు 121, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్స్ 26, మున్సిపల్ కమిషనర్లు 41, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్స్ 40 పోస్టులు భర్తీ చేయనున్నారు.
తాజావార్తలు
-
Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో అదిరిపోయే ఫీచర్లు
-
BCCI Umpires: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై అంపైర్లు అప్రమత్తంగా ఉండాల్సిందే.. లేదంటే..!
-
Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
-
IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
-
BCCI: కోచ్‌గా అతడు తాత్కాలికమే.. పనితీరు నచ్చితేనే టీమిండియాలో ఉంటాడు!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!