TRS Plenary: గులాబీ మయం.. పడవలోనూ ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గులాబీ పార్టీ సంబురానికి సర్వం సిద్ధం అయ్యింది.. హైదరాబాద్ గులాబీ మయం అయిపోయింది.. తెలంగాణ రాష్ట్ర సమితి 21 వసంతాలు పూర్తి చేసుకుని 22 వసంతంలోకి అడుగు పెడుతోన్న వేళ హైదరాబాద్ వేదికగా ప్లీనరీ నిర్వహించేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఇక, ప్రతినిధుల సభ ఈసారి 3 వేల మందితో జరుగనుంది. ఘనంగా ప్లీనరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది అధిష్టానం.. ఇక, తోరనాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు.. కటౌట్లు.. ఇలా ఎటు చూసినా గులాబీ రంగు పులుముకుంది.. ఇదే సమయంలో.. వినూత్న తరహాలో ప్రచారం చేస్తోంది టీఆర్ఎస్..
Read Also: TRS Plenary: గులాబీ సంబురం.. సర్వం సిద్ధం..
Also Read
- Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
- CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్!
హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ తీరంతో పాటు.. సాగరంలో తిరిగే బోటు కూడా గులాబీ రంగు పులుముకున్నట్టు అయ్యింది. సాగరంలో విహరించే బోటును సైతం వదలకుండా గులాబీ మయం చేశారు.. తోరణాలు, జెండాలు, ఫ్లెక్సీలతో నింపేశారు.. పార్టీ నేత సతీష్ రెడ్డి ఓ బోటును ఇలా ముస్తాబు చేశారు.. ఇక, రాత్రి సమయంలో.. హుస్సేన్ సాగర్‌లో విహరిస్తూ.. అందరినీ ఆకట్టుకుంది ఆ బోటు. ఇక, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టులు, షేర్లు, లైక్‌లతో వైరల్ చేస్తున్నాయి గులాబీ పార్టీ శ్రేణులు, అభిమానులు.. కాగా, హైదరాబాద్‌లో భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు… ఒక్కో పార్టీకి ఒక్కో న్యాయమా? వెంటనే టీఆర్ఎస్ ఫ్లెక్సీలు తొలగించాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు.
తాజావార్తలు
-
India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
-
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
-
Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
-
Zaheer Khan-MS Dhoni: ఎంఎస్ ధోనీ చక్రం తిప్పినా.. జహీర్ ఖాన్‌ను ఒప్పించడం కష్టమైంది!
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
ట్రెండింగ్
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!