★ ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు.. మే 9వ వరకు జరగనున్న పరీక్షలు.. హాజరుకానున్న 6,22,537 మంది విద్యార్థులు.. 3,776 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు.. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు
★ అమరావతి: ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రులు, వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఇతర కీలక నేతలతో సీఎం జగన్ కీలక భేటీ.. 2024 ఎన్నికలే అజెండాగా కీలక అంశాలను చర్చించే అవకాశం
★ రంజాన్ మాసం సందర్భంగా ఈరోజు సాయంత్రం విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు.. హాజరు కానున్న సీఎం జగన్
★ గుంటూరు: నేడు తాడేపల్లి డోలాస్ నగర్‌లో పర్యటించనున్న టీడీపీ నేత నారా లోకేష్
★ గుంటూరు: నేడు మంగళగిరిలో రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయ ముట్టడికి టీడీపీ పిలుపు.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్న టీడీపీ నేతలు
★ మన్యం జిల్లా : నేడు సీతంపేట ఐటీడీఏ వద్ద గిరిజనుల ఆందోళన.. అదివాసీ సమస్యలతో పాటు జీవో నెం 3కి చట్టబద్దత కల్పించాలని డిమాండ్
★ సత్యసాయి జిల్లా: నేడు ధర్మవరం పట్టణంలోని ఆర్డీటి స్కూల్ పాఠశాలలో ఉద్యోగ మేళా
★ హైదరాబాద్: నేడు మదాపూర్ హెచ్‌ఐసీసీలో టీఆర్ఎస్ 21వ ప్లీనరీ.. 11 తీర్మానాలు ప్రవేశపెట్టనున్న సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాలపై తీర్మానం చేయనున్న కేసీఆర్.. ఉదయం 11 గంటలకు కేసీఆర్ ప్రసంగం
★ హైదరాబాద్: జలసౌధ వేదికగా ఇవాళ గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం.. పలు ప్రాజెక్టుల డీపీఆర్‌ను పరిశీలించనున్న కమిటీ
★ ఢిల్లీ: దేశంలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న దృష్ట్యా ఈరోజు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
★ ఐపీఎల్ 2022: నేడు గుజరాత్ టైటాన్స్‌తో తలపడనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ముంబై వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యా