మంగళవారం భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా వింటే మీకు అన్ని శుభాలు కలుగుతాయి. క్రమం తప్పకుండా హనుమంతుడిని ధ్యానించండి. అన్నీ ఆయనే చూసుకుంటాడు. చిరంజీవి అయిన అంజనీపుత్రుడు కటాక్ష వీక్షణాలు మీకు కలగాలంటే మంగళవారం హనుమాన్ దేవాలయాన్ని సందర్శించండి. https://www.youtube.com/watch?v=DvMReMSwqMk
*నేడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి * నేడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం. ఎంపీలను ఉద్దేశించి మాట్లాడనున్న ప్రధాని మోడీ * నేడు పాకిస్తాన్ స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టులో విచారణ * నేడు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పార్లమెంటరీ సమావేశం *ఐపీఎల్: నేడు రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ *నేడు యూకే ఆధ్వర్యంలో యూఎన్ఎస్ సీ సమావేశం. ఉక్రెయిన్ పరిస్థితులపై చర్చ * నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలను ఏకతాటిపైకి నడిపేందుకు కీలక సమావేశం నిర్వహించిన రాహుల్ గాంధీ.. విబేధాలను వదిలి అంతా కలిసికట్టుగా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.. ఈ సమావేశంలో అందరి నేతల అభిప్రాయం తీసుకున్న రాహుల్.. భేటీకి సంబంధించిన విషయాలను ముగ్గురు మాత్రమే మీడియాకు వెల్లడించాలని సూచించారు. దీంతో.. సమావేశం ముగిసిన తర్వాత.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి…
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి లేఖ రాసిన టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ.. ఈ లేఖ రాసిన క్షణం నుంచి తాను కాంగ్రెస్ గుంపులో లేనట్లేనని పేర్కొన్న విషయం తెలిసిందే.. సడెన్‌గా వచ్చి లాబీయింగ్ చేస్తే ఎవరైనా పీసీసీ కావొచ్చని లేఖలో పేర్కొన్న ఆయన.. తనపై కోవర్ట్ అనే నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ కాంగ్రెస్‌లో వర్గ పోరు వుండేదని గుర్తుచేసిన ఆయన.. త్వరలో టీపీసీసీ వర్కింగ్…
తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. అందులో భాగంగా.. నేతల మధ్య ఉన్న అసంతృప్తులకు చెక్ పెట్టే విధంగా కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఢిల్లీలో మకాం వేసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు.. అయితే, రాహుల్‌తో సమావేశం కొనసాగుతుండగానే మధ్యలోనే సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు పార్టీ సీనిరయర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. అందరితో కలిసి మాట్లాడిన రాహుల్ గాంధీ.. ఒక్కొక్కరి అభిప్రాయాలు తెలుసుకునే పనిలో…
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మరోసారి హాట్ కామెంట్లు చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చొడులో మాటా ముచ్చట కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ ఊసరవెల్లి లా మారాడు అంటూ ఫైర్ అయ్యారు.. రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చీమకుట్టినట్టు కూడా లేదు ముఖ్యమంత్రి కేసీఆర్‌కి అని ఆరోపించిన ఆమె.. ప్రతి చివరి గింజ కొనుగోలు చేస్తానని మాట…
తెలంగాణలో గత కొంత కాలంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. అధికారపక్షానికి, గవర్నర్‌కు క్రమంగా దూరం పెరుగుతూ పోతోంది.. కొన్ని సార్లు ప్రత్యక్షంగా.. పరోక్షంగా ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై కామెంట్లు కూడా చేశారు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. ఈ మధ్య రాజ్‌భవన్ వేదికగా నిర్వహించిన ఉగాది వేడుకల్లోనూ.. ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలను ఉగాది ఉత్సవాలకు ఆహ్వానించినా వారు ఎవరు రాలేదని గవర్నర్ తమిళిసై అసంత్రృప్తి వ్యక్తం చేశారు.…
వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గని’ చిత్రం ఈ నెల 8న జనం ముందుకు రాబోతోంది. అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని సినిమా టిక్కెట్ రేట్లను తగ్గించినట్టుగా చిత్ర నిర్మాతలు అల్లు బాబీ, సిద్ధు ముద్ధు చెబుతున్నారు. తెలంగాణలో మల్టీప్లెక్స్ లో రూ. 200 ప్లస్ జీఎస్టీ ఉంటుందని, సింగిల్ స్క్రీన్స్ లో జీఎస్టీ తో కలిపి టిక్కెట్ ధర రూ. 150 ఉంటుందని చెబుతున్నారు. నిజానికి ఇది సినిమా రేట్లను తగ్గించడం ఎంతమాత్రం…
శ్రీరామనవమి ఉత్సవాలకు భద్రాచలం ముస్తాబవుతోంది. శ్రీసీతారామచంద్రస్వామి వారి కళ్యాణం ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోనే రెండో అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ మేరకు ఏప్రిల్ 2 నుంచి 16 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 10న శ్రీరాముల వారి కల్యాణం, 11న పట్టాభిషేకం నిర్వహించనున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా స్వామి వారి కల్యాణానికి పరిమిత…
పాడి పరిశ్రమకు ఎన్నో అవకాశాలున్నాయి.. ఓవైపు వ్యవసాయం చేస్తూనే.. మరోవైపు పాడి ఉత్పత్తులకు రైతులు ప్రయత్నిస్తున్నారు.. కొందరైతే వ్యవసాయానికి స్వస్తి చెప్పి.. పాల డైరీలను నిర్వహిస్తూ.. ఉపాధి పొందుతూ.. మరో నలుగురికి పని కల్పిస్తున్నారు. క్రమంగా పాలు, పాల ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండడంతో.. రైతులకు లాభాలు తెచ్చి పెడుతోంది ఈ పరిశ్రమ.. అయితే, నిర్వహణ కూడా చాలా కష్టంతో కూడుకున్న పనే.. బర్రెలు, ఆవులు తీసుకురావడం.. వాటికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఏర్పాట్లు చేయడం.. గడ్డి, గాసం,…