Patnam Mahender Reddy: టీఆర్ఎస్ ఎమ్మెల్సీపై కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పై కేసు నమోదు చేశారు పోలీసులు.. ఇన్స్పెక్టర్‌ను అసభ్యకరంగా దూషించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిపై తాండూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.. అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ అయిన మహేందర్ రెడ్డిపై 353, 504,506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు..
Read Also:Munnur Ravi: టీఆర్‌ఎస్ ప్లీనరీలో కలకలం.. మున్నూరు రవి ప్రత్యక్షం..
Also Read
కాగా, తాండూరు పట్టణంలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా రథోత్సవం రోజున ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు… ఈ విషయమై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి.. తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డికి ఫోన్ చేసి రౌడీషీటర్లకు కార్పెట్లు వేస్తావా? రా లం… కొడకా..! నీ అంతు చూస్తా..! అని వార్నింగ్ ఇచ్చారు. పద్ధతిగా మాట్లాడాలని సీఐ వారిస్తుంటే.. రికార్డు చేసుకో.. మీడియాకు ఇచ్చుకో.. నీ అంతు చూస్తా అంటూ హెచ్చరించారు.. ఎమ్మెల్యే రౌడీషీటరా? అని సీఐ ప్రశ్నించగా.. వాడి పక్కన రౌడీషీటర్లు లేరారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, ఇసుక దందాలో నీ ప్రమేయం లేదా? ఇప్పటినుంచి నీ అంతు చూస్తా అంటూ ఫోన్‌లో సీఐ రాజేందర్ రెడ్డిపై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయారు.. ఆ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోగా… చివరకు కేసు నమోదు చేశారు పోలీసులు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?