అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల… ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని చేపట్టిన ధర్నాలో పాల్గొన్న ఆమె… ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను వెన్నుపోటు పొడిచాడని మండిపడ్డారు.. ఈ రోజు రాష్ట్రంలోని ప్రతి పైసా సంపద తెలంగాణ ప్రజలదేనన్న ఆమె.. తెలంగాణ ప్రజల నెత్తిన కేసీఆర్ నాలుగు లక్షల కోట్ల అప్పు పెట్టారంటూ ఆరోపించారు.. Read Also:…
తెలంగాణలో పరిపాలన గాడి తప్పింది.. వెంటనే గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. గవర్నర్ ఢిల్లీ పర్యటనపై స్పందించిన ఆయన.. సీఎం కేసీఆర్ తన కొడుకుని సీఎం చేయలేక తప్పించుకోవడం కోసం రాజ్ భవన్తో గొడవ పెట్టుకుంటున్నారు అని గవర్నర్ ఢిల్లీలో చెప్పారన్నారు రేవంత్రెడ్డి.. గవర్నర్ మీడియాతోనే చెప్పారన్నారు.. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం జీహెచ్ఎంసీ గవర్నర్ పరిధి అని.. గవర్నర్కి సెక్షన్ 8 ప్రకారం విశేష అధికారులున్నాయి.. పరిపాలన గాడి తప్పింది కాబట్టి..…
తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్వహించిన ఉగాది వేడుకలు పెద్ద చర్చగా మారిపోయాయి.. సీఎం కేసీఆర్, మంత్రులు, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఎవ్వరూ హాజరు కాకపోవడంపై.. గవర్నర్ తమిళిసై కూడా అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో.. కొందరు బీజేపీ నేతలు కూడా డుమ్మా కొట్టారు.. దీనిపై పీసీసీ చీప్ రేవంత్రెడ్డి మండిపడ్డారు.. అసలు రాజ్ భవన్లో ఉగాది వేడుకలకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి…
తెలంగాణ పర్యటనకు వచ్చిన మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా.. ఇవాళ మంత్రి కేటీఆర్ను కలిశారు.. ఉదయం ప్రగతి భవన్కు వచ్చిన సంగ్మా దంపతులను.. మంత్రి కేటీఆర్, ఆయన సతీమణి శైలిమ శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.. ఇక, వివిధ అంశాలపై కేటీఆర్, సంగ్మా మధ్య చర్చలు జరిగాయి.. మేఘాలయ, తెలంగాణ రాష్ట్రాల మధ్య సంబంధాలు, వ్యాపారాలపై ఐటీ మంత్రి చర్చించినట్లు సమాచారం. ఇక, ఈ సమావేశం విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్…
ధాన్యం కొనుగోళ్ల అంశం పై ఢిల్లీలో పోరాటానికి సిద్ధమవుతోంది టీఆర్ఎస్ పార్టీ. వరిపోరును ఉధృతం చేసింది టీఆర్ఎస్ పార్టీ. వరుస ఆందోళనలతో హీట్ పుట్టిస్తున్న గులాబీ పార్టీ నేతలు గురువారం తెలంగాణలోని అన్ని జిల్లాకేంద్రాల్లో దీక్షలు చేపట్టింది. టీఆర్ఎస్ దీక్షలతో జిల్లా కేంద్రాలన్నీ హోరెత్తాయి. దీక్షలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రైతుబంధు సమితి ఛైర్మన్లు సహా ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. సిరిసిల్లలోని అంబేడ్కర్ కూడలిలో నిర్వహించిన నిరసన దీక్షలో మంత్రి కేటీఆర్…
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి కేంద్ర వైఖరిని టీఆర్ఎస్ తప్పుబడుతోంది. తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. మొన్న అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టిన టీఆర్ఎస్. గురువారం రాష్ట్రంలో జాతీయ రహదారులను దిగ్భందించింది. తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. వడ్ల కొనుగోలు పై కేంద్రం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ మంత్రి హరీష్ రావు…
వైద్య రంగంలో అద్భుతం చోటు చేసుకుంది. జీవితంలో ఒక్కసారైనా అమ్మ అని పిలిపించుకోవాలన్న ఓ మహిళ భర్త మరణించిన 11 నెలల తర్వాత మాతృత్వం పొందింది. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన ఓ జంటకు 2013లో వివాహం జరిగింది. అయితే పెళ్లయి ఏడేళ్లు దాటినా వారికి పిల్లలు పుట్టలేదు. దీంతో వీళ్లు వరంగల్లోని ఓ సంతాన సాఫల్య కేంద్రంలో 2020 నుంచి చికిత్స తీసుకుంటున్నారు. అదే ఏడాది ఏడాది మార్చిలో అక్కడి వైద్యులు పరీక్షల నిమిత్తం…
మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తాండూరు మండలం అచ్చలాపూర్ గ్రామంలో ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె ఆత్మహత్యకు ఓ యువకుడు పెట్టిన వాట్సాప్ స్టేటస్ కారణం అని తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే… అచ్చలాపూర్ పంచాయతీ పరిధిలోని కొమ్ముగూడకు చెందిన 17 ఏళ్ల యువతి హైదరాబాద్లో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల ఉగాది పండగ సందర్భంగా ఆమె స్వగ్రామానికి వచ్చింది. ఈ సందర్భంగా స్థానికంగా ఉండే యువకుడు అజయ్ ఆమెతో…
★ నేడు నంద్యాలలో సీఎం జగన్ పర్యటన ★ నేడు జగనన్న వసతి దీవెన రెండో విడత నిధుల విడుదల.. 10,68,150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,024 కోట్లు జమ చేయనున్న సీఎం జగన్ ★ తిరుమల: నేటి నుంచి టీటీడీ ప్రత్యేక దర్శనం టిక్కెట్లు విడుదల.. వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనం టిక్కెట్లను విడుదల చేయనున్న టీటీడీ.. ఏప్రిల్ నెల కోటా రోజుకు వెయ్యి చొప్పున విడుదల ★ ఏపీలోని అన్ని జిల్లాలలో నేటి…
ఈనెల 17 నుంచి 24 వరకు కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ప్రాణహిత పుష్కరాలు జరగనున్నాయి. ఈ మేరకు జిల్లాలోని తుమ్మిడిహెట్టి వద్ద నిర్వహించనున్న ప్రాణహిత పుష్కరాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో గురువారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో ఆయన పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అదనపు ఎస్పీ అచ్చేశ్వర్ రావు, అదనపు కలెక్టర్ రాజేశం, వరుణ్రెడ్డి హాజరయ్యారు. ప్రాణహిత పుష్కరాలకు భక్తులకు ఎలాంటి…