తెలంగాణలో బీజేపీ కేంద్ర పార్టీ చాప కింద నీరులా తమ యాక్టివిటీ చేసుకుంటూ పోతోంది. ఇప్పటికే సెంట్రల్ టీంలు తెలంగాణలో మకాం వేసాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.. ఇక, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఉమ్మడి జిల్లాకో ఇంచార్జ్ ని కేంద్ర పార్టీ నియమించబోతుంది అని తెలుస్తుంది… ఈ ఇంచార్జ్ లు ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు ఉంటారని సమాచారం. ఇప్పటికే కేంద్రంలోని పార్టీ.. కొన్ని టీమ్‌లను తెలంగాణ పంపిందని టాక్. ఆ టీమ్‌లు తెలంగాణలో పార్టీ పరిస్థితి, నేతల పనితీరుపై ఢిల్లీ పెద్దలకు రిపోర్టులు కూడా పంపాయని కూడా కమలనాథుల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో పార్టీ యాక్టివిటీని మరింత స్పీడప్ చేసేందుకే రాష్ట్రానికి పార్టీ ఇంఛార్జ్‌లను బీజేపీ హైకమాండ్ పంపుతున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.
Read Also: Temperatures: భానుడి భగభగలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ