తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. కుండపోత వానలతో రాష్ట్రం తడిసి ముద్దైపోయింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో 72 గంటలు భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో ప్రభుత్వయంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యం లో నేడు, రేపు GHMC పరిధిలోని పాఠశాలలకు హాఫ్ డే ప్రకటించిది విద్యాశాఖ.
Also Read:Coolie : వామ్మో.. ‘కూలీ’ ఒక్క టికెట్ ఎన్ని వేలో తెలుసా..?
ఆగస్టు 13, 14 తేదీలలో హాఫ్ డే మాత్రమే పనిచేయనున్నాయి. GHMC పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఆగస్టు 13, 14 తేదీలలో హాఫ్ డే సెలవు ఉండనున్నది. పాఠశాలలు ఉదయం పూట మాత్రమే పనిచేస్తాయి. పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో పాటు హనుమకొండ, జనగాం, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉంది. ఈ 5 జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది విద్యాశాఖ. హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలో 13, 14 తేదీల్లో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ఉండనుంది.
Also Read:Nara Lokesh: 30 ఏళ్ల తరువాత.. పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది..!
ఐటి సంస్థలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే అవకాశం ఇవ్వాలని సూచించింది. వచ్చే మూడు నాలుగు రోజుల పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఉత్తమ్ ఆదేశాలు జారీ చేశారు. నాలుగు రోజుల పాటు ఇరిగేషన్ శాఖలో అధికారుల సెలవులు రద్దు చేశారు. ప్రాజెక్టులు.. రిజర్వాయర్లు..కాలువలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు ఉన్నా నేను కూడా అందుబాటులో ఉంటానన్నారు. ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలని అధికారులను ఆదేశించారు.