తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2తో పాటు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాల రిలీజ్ సందర్భంగా మన తెలుగు సినీ నిర్మాతల రెండు నాలుకల ధోరణి బయటపడింది. నిజానికి సినిమా థియేటర్లకు ఎవరూ రావడం లేదు, సినీ పరిశ్రమ ఇలా అయితే ఇబ్బంది పడుతుంది, థియేటర్లు మూతపడతాయంటూ బాధపడిన నిర్మాతలే ఇప్పుడు ఈ సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. వార్ * సినిమాని నాగవంశీ రిలీజ్ చేస్తుంటే, కూలీ సినిమాని ఏషియన్ సునీల్, సురేష్ బాబు, దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. అయితే, కూలీ సినిమాకి ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్లు పెంచుకునేందుకు జీవో జారీ చేయడమే కాదు, బెనిఫిట్ షోలకు కూడా అవకాశం కల్పించారు.
Also Read : Lavanya Tripathi : ‘చిత్తూరు పిల్ల’నంటున్న మెగా కోడలు!
నిజానికి ఈ రెండు సినిమాలు నేరుగా తెలుగు సినిమాలు కాదు. వార్ 2 హిందీ సినిమా కాగా, దాన్ని తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారు. కూలీ కూడా తమిళ సినిమాని తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారు. కూలీలో నాగార్జున ఉండగా, వార్ 2లో ఎన్టీఆర్ ఉండడంతో తెలుగు ఆడియన్స్ ఆదరిస్తారని నమ్మకం. ఇదంతా బానే ఉంది, కానీ నేరుగా తమిళంలో రిలీజ్ చేస్తున్న చోట కూడా లేని టికెట్ రేట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా చోట్ల ఉన్నాయి. వార్ 2 పరిస్థితి కూడా దాదాపు అంతే. నార్త్ బెల్ట్‌లో ముంబై, ఢిల్లీ లాంటి కొన్ని ప్రదేశాల్లో మల్టీప్లెక్స్‌లను మినహాయిస్తే, మిగతా ఏరియాల్లో టికెట్ రేట్లు తక్కువ. కానీ తెలుగు ఆడియన్స్ మాత్రం టికెట్ రేటు ఎంత పెట్టినా చూసేస్తారేమో అనే ఉద్దేశంతో టికెట్ రేట్లను భారీగా పెంచి అమ్ముతున్నారు.
Also Read : Coolie : ‘కూలీ’ సినిమాకు ఏపీలో టికెట్ ధరల పెంపు.. ఎంతంటే ?
ఒకపక్క థియేటర్లకు జనం రావడం లేదు, వాళ్లకి నెమ్మదిగా అది ఎట్లా దూరం అయిపోతోంది అనేది నిర్మాతలే ఇప్పుడు అవకాశం ఇచ్చిన ప్రతిసారీ భారీగా రేట్లు పెంచి అమ్ముకుంటున్నారు. నిజానికి వాళ్లేమీ రేట్లు పెంచినా సరే, బలవంతంగా మా సినిమా చూడాలని చెప్పడం లేదు. కానీ అలాంటప్పుడు సినిమా థియేటర్లకు జనాలు రావడం లేదని బాధ వ్యక్తం చేయడం కరెక్ట్ కాదనేది వాస్తవం. ఇందులో మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి.