Raja Singh: బీజేపీలో చేరుతున్నారా?.. కొన్ని మాటలు యాది పెట్టుకోండి, మరికొన్ని రాసి పెట్టుకోండి!
- బీజేపీలో చేరుతున్న వారికి రాజా సింగ్ హెచ్చరికలు
- పార్టీలో చేరే ముందు కొన్ని మాటలు యాది పెట్టుకోండి
- బీజేపీలో చేరేముందు కొంతమందితో చర్చలు చేసుకొని రండి
- బాధలు భరించే శక్తి మీలో పెంచుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Goshamahal MLA Raja Singh warns newcomers to BJP: బీజేపీలో చేరుతున్న వారికి గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. బీజేపీ పార్టీలో చేరుతున్న వారికి స్వాగతం-సుస్వాగతం.. పార్టీలో చేరే ముందు కొన్ని మాటలు యాది పెట్టుకోండి, మరికొన్ని రాసి కూడా పెట్టుకోండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీలో చేరిన తర్వాత మీరు కోరుకున్నది మీ అసెంబ్లీ, మీ జిల్లా, మీ పార్లమెంటరీ నియోజకవర్గంలో జరగదు అని చెప్పారు. మీపైన విశ్వాసం పెట్టుకొని మీ కార్యకర్తలు బీజేపీలో చేరిన తర్వాత మీరు వారికి ఏ పదవి కూడా ఇప్పించలేరని పేర్కొన్నారు. బీజేపీలో చేరేముందు కొంతమందితో చర్చలు చేసుకొని రండి అని రాజా సింగ్ సూచనలు చేశారు. ఇటీవల రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వెయ్యనివ్వలేని కారణంగానే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.
‘బీజేపీలో వేరే పార్టీ నుంచి చాలామంది చేరుతున్నారు. బీజేపీ పార్టీలో చేరుతున్న వారికి స్వాగతం-సుస్వాగతం. బీజేపీలో చేరే ముందు కొన్ని మాటలు యాది పెట్టుకోండి, రాసి కూడా పెట్టుకోండి. బీజేపీలో చేరిన తర్వాత మీరు కోరుకున్నది మీ అసెంబ్లీలో, మీ జిల్లాలో, మీ పార్లమెంటరీ నియోజకవర్గంలో జరగదు. మీపైన విశ్వాసం పెట్టుకొని మీ కార్యకర్తలు బీజేపీలో చేరిన తర్వాత వారికి ఏ పదవి కూడా ఇప్పించలేరు. ఎన్నికల ముందు మీకే టికెట్ వస్తదని గ్యారెంటీ కూడా ఉండదు. బీజేపీలో ఈ రోజు మీరు చేరుంటారు కదా. మొదట్లో ఫస్ట్ సీట్లో మీరు ఉంటారు కానీ తర్వాత లాస్ట్ సీట్లో ఉంటారు. బీజేపీలో చేరిన తర్వాత కొన్ని అలవాట్లు మీరు చేసుకోవాలి. కొన్ని బాధలు కూడా భరించే శక్తి కూడా మీలో పెంచుకోవాలి’ అని ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు.
Also Read
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
Also Read: World Cup 2025: అన్ని మారాయి.. వన్డే ప్రపంచకప్ తప్పక గెలుస్తాం: టీమిండియా కెప్టెన్
‘మా అసెంబ్లీలో 11 సంవత్సరాలుగా వారి అణచివేతను ఎదుర్కొంటున్నాము. మా జిల్లా, డివిజన్, నియోజకవర్గంలో వాళ్ల వ్యక్తి ఉంటాడు. మేము కోరుకున్నా మమ్మల్ని మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన మా కార్యకర్తల కోసం ఏమీ చేయలేకపోయాము. గోషామహల్ అసెంబ్లీ నుంచి బీజేపీలో చేరేముందు కొంతమందితో మీరు మాట్లాడి.. చేరిన తర్వాత ఏమైతదని కనుక్కోండి. విజయశాంతి, జితేందర్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి.. చాలా మంది వేరే పార్టీ నుంచి బీజేపీలో చేరిన తర్వాత ఎందుకు వెళ్లిపోయారో కనుక్కోండి. నా పర్సనల్ విజ్ఞప్తి ఏంటంటే?.. అలాంటి వారితో ఒక్కసారి మాట్లాడండి. హిందూత్వానికి, దేశానికి, సమాజానికి చాలా మంచి పనులు చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ. కానీ తెలంగాణలో బీజేపీ పార్టీ కొందరి వల్ల సర్వనాశనం అవుతోంది. బీజేపీలో మేము ఏది చెప్తే అదే అయితది, మేము ఏది రాసితే అదే రాజ్యమైతది అనుకునే వ్యక్తుల వల్లనే పార్టీ సర్వనాశనం అవుతుంది. ఈరోజు కాకపోతే రేపు తెలంగాణలో రాక్షసులు నాశనమవుతారు. కార్యకర్తల ఆశీస్సులతో బీజేపీ తెలంగాణను పాలిస్తుంది. తెలంగాణలో సీఎం బీజేపీ నుంచే వస్తారు’ అని ఎమ్మెల్యే రాజా సింగ్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
-
Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!