పొంగి ప్రవహిస్తున్న బుడమేరు.. విజయవాడ నగరవాసులకు టెన్షన్..!
విజయవాడ నగరవాసులను మరోసారి బుడమేరు వరద టెన్షన్ పెడుతుంది.. గత ఏడాది ఇదే సమయంలో నగరాన్ని ముంచెత్తింది బుడమేరు వరద.. భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.. అదో పీడకలగా మారిపోయింది.. అయితే, రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలుచోట్ల పొంగి ప్రవహిస్తోంది బుడమేరు.. గుణదల ఒకటవ డివిజన్ లోని వంతెనపై నుంచి బుడమేరు ప్రవహిస్తోంది.. దీంతో, వంతెనపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.. అయితే, వరద ఉధృతి పెరిగితే బుడమేరు అంచున ఉన్న ఇళ్లలోకి నీరు చేరే అవకాశం ఉంది.. మరోవైపు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వరద ఉధృతి పెరిగితే గత ఏడాది పరిస్థితులు పునరావృతం అవుతాయని బుడమేరు పరివాహ ప్రాంతాల ప్రజల్లో ఆందోళన మొదలైంది.. వరద నీటితో పాటు పాములు, తేళ్లు, విష పురుగులు ఇళ్లలోకి వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇక, బుడమేరు ప్రవాహానికి అడ్డుగా ఉన్న తూటుకాడను వీఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు.. మరోసారి గత ఏడాది పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు..
వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో స్వల్ప భూకంపం
వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మూడు గ్రామాలలో భూకంపం సంభవించింది. బసిరెడ్డిపల్లి, రంగాపూర్, నామత్ నగర్, హనుమాన్ గండి ప్రాంతాలలో భూ ప్రకంపనలు వచ్చాయని గ్రామస్తులు తెలిపారు. కొన్ని సెకన్లపాటు భూమి కంపించిందని ఇంట్లో ఉన్న సామాన్లు కిందపడినట్లు వెల్లడించారు. భూకంపం సంభవించిన వెంటనే ఇళ్లలోంచి బయటకు వచ్చామని తెలిపారు. ఓ వైపు వర్షాలతో బెంబేలెత్తుతుంటే మరోవైపు భూ ప్రకంపనలు వికారబాద్ జిల్లాలో భయాందోళనలు కలిగిస్తున్నాయి.
పీఎం మోడీ ఆయనను రెండుసార్లు నోబెల్‌కు నామినేట్ చేయాలి.. ట్రంప్‌పై అమెరికా మాజీ ఎన్‌ఎస్‌ఏ విమర్శలు
డొనాల్డ్ ట్రంప్ అనవసరంగా భారత్ పై అక్కసు వెల్లగక్కుతున్నాడని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ ఆరోపించారు. ట్రంప్ తప్పుడు విధానాలు భారత్-అమెరికా సంబంధాలపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయని ఆయన అన్నారు. అమెరికా భారతదేశంపై 50 శాతం సుంకం విధించిన విషయం తెలిసిందే. చైనా కూడా రష్యన్ చమురును కొనుగోలు చేస్తుందని, కానీ అమెరికా చైనాపై సుంకం విధించలేదని బోల్టన్ అన్నారు. సుంకాల ప్రభావాన్ని రద్దు చేయడానికి సమయం పడుతుందని బోల్టన్ హెచ్చరించారు. “గత 30 రోజుల్లో వైట్ హౌస్ భారత్ కు చేసిన నష్టం, నమ్మకం, విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి చాలా సమయం పడుతుంది” అని ఆయన అన్నారు.
పుతిన్ కాస్కో.. యుద్ధం ఆగకపోతే దబిడి దిబిడే.. ట్రంప్ హెచ్చరిక
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం 2022 లో ప్రారంభమైంది. ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ యుద్ధాన్ని ఆపడానికి అనేక దేశాలు ప్రయత్నాలు చేశాయి. అయితే, ఎవరూ విజయవంతం కాలేదు. కాల్పుల విరమణకు అంగీకరించలేదు. ఇంతలో, రేపు, అంటే ఆగస్టు 15 న, అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగే సమావేశం ఈ యుద్ధం పరంగా కీలకంగా మారింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా ముగించాలో ఇద్దరు నాయకులు చర్చించనున్నారు. ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణకు రష్యా అంగీకరించకపోతే, రష్యా మరిన్ని ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు.
ఐసిఐసిఐ బ్యాంక్ యూ-టర్న్.. కనీస బ్యాలెన్స్ పరిమితి తగ్గింపు.. ఖాతాలో ఇంత డబ్బు ఉంటే చాలు
ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్లకు శుభవార్త అందించింది. కొత్త కస్టమర్ల కోసం ఇటీవల పెంచిన కనీస బ్యాలెన్స్ పరిమితిని తగ్గించింది. పొదుపు ఖాతా కనీస బ్యాలెన్స్ (MAB) నియమాలను మళ్ళీ మార్చామని, కస్టమర్లకు ఉపశమనం కలిగిస్తూ, ఈ పరిమితిని మెట్రో, పట్టణ ప్రాంతాల్లో రూ. 50,000 నుంచి రూ. 15,000 కు తగ్గించామని వెల్లడించింది. మెట్రో, పట్టణ ప్రాంతాల్లో పొదుపు ఖాతాలలో కనీస నెలవారీ సగటు బ్యాలెన్స్ (MAB) పరిమితిని మార్చినప్పటికీ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో దీనిని రూ.25,000 నుంచి రూ.7,500కి, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,000 నుంచి రూ.2,500కి తగ్గించారు. అయితే, ఖాతాదారులు తమ ఖాతాలో నిర్దేశించిన పరిమితి కంటే తక్కువ బ్యాలెన్స్ ఉంచుకుంటే, వారు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని బ్యాంక్ స్పష్టం చేసింది.
రిటైర్మెంట్ న్యూస్ మధ్య.. విరాట్ కోహ్లీ పోస్ట్ వైరల్!
టీ20, టెస్ట్ ఫార్మాట్‌ల నుంచి రిటైర్ అయిన తర్వాత భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పుడు పూర్తిగా వన్డేలపై దృష్టి సారించాడు. ఆగస్టులో బంగ్లాదేశ్‌తో జరగాల్సిన వన్డే సిరీస్ వాయిదా పడడంతో.. అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో విరాట్ ఆడనున్నాడు. ఈ సిరీస్ విరాట్ కెరీర్‌కు చివరిది కావచ్చని అందరూ భావిస్తున్నారు. అయితే తనలో ఇంకా ఆడే సత్తా ఇంకొన్నేళ్లు ఉందని కింగ్ ఓ పోస్ట్ ద్వారా చెప్పకనే చెప్పాడు. కోహ్లీ తాజాగా నెట్ సెషన్‌కు సంబందించిన ఓ ఫొటో షేర్ చేశాడు. ఆ ఫోటో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎప్పుడెప్పుడు తిరిగి రావాలనే అతని ఆసక్తిని స్పష్టంగా చూపిస్తోంది. విరాట్ కోహ్లీ చివరగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడాడు. ఆపై ఐపీఎల్ 2025 ఆడాడు. టెస్ట్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ సిరీస్ ఆడలేదు. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ వాయిదా పడింది. అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో కింగ్ బరిలోకి దిగనున్నాడు. ఈ సిరీస్ కోసం విరాట్ ఇప్పటికే ప్రాక్టీస్ మొదలెట్టాడు. ప్రాక్టీస్‌కు సంబంధించిన ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో కోహ్లీతో పాటు గుజరాత్ టైటాన్స్ అసిస్టెంట్ కోచ్ నయీమ్ అమీన్ ఉన్నాడు. ‘నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు సోదరా. నిన్ను చూడటం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది’ అని పేర్కొన్నాడు.
తండ్రి బాటలోనే సారా.. త్వరలోనే రిలేషన్‌షిప్‌పై అధికారిక ప్రకటన!
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్కూలర్ లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. 1990లో ఎయిర్‌పోర్టులో అంజలిని చూసి.. తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడు. ఆ సమయంలో మెడిసిన్ చేసే అంజలికి క్రికెట్ గురించి పెద్దగా తెలియదు. స్నేహితురాళ్లు ‘సచిన్.. సచిన్’ అంటుండగా.. ఎయిర్‌పోర్టులో మొదటిసారి చూశారు. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది. 1994లో సచిన్, అంజలిల నిశ్చితార్థం జరగగా.. 1995 మే 24న పెళ్లి చేసుకున్నారు. సచిన్ కంటే అంజలి రెండేళ్లు పెద్దది అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు సారా టెండ్కూలర్ కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నారు. సారా టెండూల్కర్, టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మధ్య ప్రేమాయాణం నడుస్తుందని గత 2-3 ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరు కలిసి రెస్టారెంట్స్, పార్టీలలో కనిపించడమే కాకుండా.. గిల్ ఆడే మ్యాచ్‌లకు సారా హాజరవడమే ఇందుకు కారణం. ఈ వార్తలను సచిన్ ఫ్యామిలీ ఇంతవరకు ఖండించలేదు. మరోవైపు అలాంటిది ఏమీ లేదని గిల్ చెపుతున్నా తరచుగా ఇద్దరు కలవడంతో డేటింగ్ వార్తలకు పులిస్టాప్ పడడం లేదు. తాజాగా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ నిర్వహించిన ఓ చారిటీ కార్యక్రమానికి గిల్‌తో పాటు సారా కూడా హాజరయ్యారు. దాంతో డేటింగ్ వార్తలు మరలా ఊపందుకున్నాయి.
కూలీ ఓవర్సీస్ రివ్యూ..
సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో వచ్చిన భారీ యాక్షన్ చిత్రం కూలి. టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్, బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ క్యామియో ఇలా ఒక్కో భాష నుండి ఒక్కో స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా తెరకెక్కింది. భారీ సినిమా భారీ హైప్.. రికార్డ్ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ తో ఎక్కడ చుసిన కూలీ ఫీవర్ తో మారుమోగిన కూలీ ఓవర్సీస్ ప్రీమియర్స్ ముగిసాయి. బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే.. సూపర్ స్టార్ 50 ఇయర్స్ స్పెషల్ టైటిల్ కార్డుతో స్టార్ట్ అయిన కూలీ సినిమా స్టార్ట్ అయినా మొదటి గంట వరకు చాలా ఫ్లాట్ గా సాగుతుంది. ఒకే ఒక ఫైట్ హై ఫీల్ ఇస్తుంది తప్ప రిమైనింగ్ అంత వీక్ నేరేషన్ లో సాగుతుంది. ఊహించని మలుపుతో మరియు మంచి ప్రీ-ఇంటర్వెల్ సీక్వెన్స్‌తో ముగిసింది. ఫస్ట్ హాఫ్ ను నాగార్జున మరియు సౌబిన్ షాహిర్ చాలా వరకు సేవ్ చేసారు. నాగార్జున స్టైల్ మరియు నటన, ఐ యమ్ ది డేంజర్ సాంగ్ ఫ్యాన్స్ కు ట్రీట్ లా ఉంటాయి. ఇక సెకండాఫ్ స్టార్ట్ అవడమే నీరసంగా స్టార్ట్ అయిన కూలీ వావ్ అనిపించే మూమెంట్ ఎక్కడ కనిపించదు. యాక్షన్ సన్నివేషాలలో కొన్ని పాత సినిమా పాటలను ఉపయోగించడం తప్ప, లోకేష్ ఎక్కడ తన క్రియేటివిటీ చూపించలేదు. సూపర్ హిట్ అయిన మోనికా పాట ప్లేస్ మెంట్ అసలు సెట్ అవలేదు. ఇక క్లైమాక్స్ చివరి 20 నిమిషాలు తప్ప చెప్పుకోవానికి ఏమి లేదు. ఓవరాల్ గా కూలీ అంచనాలను అందుకోలేదని ఓవర్సీస్ నుండి వస్తున్న టాక్.