పేదరికాన్ని రూపుమాపాలన్నా.. ఒక వ్యక్తిని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లేది కేవలం చదువు మాత్రమే. అందుకే విద్యకు అంత ప్రాధాన్యతనిస్తూ ఖర్చుకు వెనకాడకుండా తమ పిల్లలను చదివిస్తున్నారు. ప్రభుత్వాలు సైతం విద్యావ్యాప్తికి కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. 20 మంది విద్యార్థులు ఉంటే చాలు.. ఆ ఏరియాలో ప్రభుత్వ పాఠశాల లేనట్టైతే వెంటనే ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాలని ఆదేశించింది. Also Read:Warangal: ఇన్స్టాలో…
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్స్టాగ్రామ్ యాప్ ను చిన్నా పెద్ద అనే తేడా లేకుండా యూజ్ చేస్తున్నారు. రకరకాల వీడియోలతో హల్ చల్ చేస్తున్నారు. అయితే ఇన్స్టాలో సరదాగా చేసిన రీల్స్ ఒక్కోసారి గొడవలకు దారితీస్తున్నాయి. తాజాగా వరంగల్ లో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలిక, బాలుడు ముద్దు పెట్టుకుంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇంకేముంది ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఇదే…
బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కుమార్తె, పార్టీ ఎమ్మెల్సీ కవిత మాటలు, చేతలు ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్. ఇంటా బయటా రకరకాల ఇబ్బందులతో సతమతం అవుతున్నారామె. అది స్వయంకృతమా? లేక పరిస్థితుల ప్రభావమా అన్న విషయాన్ని పక్కనబెడితే.. ప్రస్తుతం తన సమస్యలకు విరుగుడు కనుక్కునే పనిలో బిజీగా ఉన్నారట కవిత.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం వస్తుందని భావించి భంగపడ్డ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాంటి వారిని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మొదట్లో బుజ్జగించారు. ఆ తర్వాత అగ్రనాయకత్వంతో మాట్లాడించాలని నిర్ణయించింది పార్టీ. ఈ క్రమంలోనే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే... అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలిపించాలని టార్గెట్ ఫిక్స్ చేసిందట అధిష్టానం. పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో కూడా ఇదే అంశంపై క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది.
Rajnath Singh: చాలా మంది యోధులు చిన్న వయసులోనే స్వాతంత్ర్య కోసం ప్రాణాలు వదిలారు అని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు వంటి వాళ్ళు ఎంతోమంది తమ ప్రాణాలు వదిలారు.. భారత స్వాభిమానం, తెలుగు రాష్ట్రాల గుర్తుగా నిలిచిపోయారు.
Harish Rao: పోలవరం, పోతిరెడ్డిపాడు, పులిచింతల లాంటి ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులను నిరసిస్తూ 20 ఏళ్ల క్రితం ఇదే రోజున (04/07/2005) మంత్రి పదవులకు రాజీనామాలు చేశామని మాజీ మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. కేసీఆర్ ఆదేశాలతోనే.. ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ నీటి హక్కుల కోసం పదవులను గడ్డి పోచలుగా భావించి వదులుకున్నామని పేర్కొన్నారు.
అధికారులను పంపించి ముగ్గు వేయించిన తరువాత ఇందిరమ్మ ఇళ్లు ఎలా క్యాన్సల్ చేస్తారని ప్రశ్నించారు. పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసిన శ్రీరాములపేటలో ఇప్పటి వరకు ఎందుకు ఇందిరమ్మ డబ్బులు ఇవ్వలేదని అడిగారు. దళిత బంధు వచ్చిన దళితులకు ఇందిరమ్మ ఇళ్లు ఎందుకు ఇవ్వరు.. ఎన్నికల మేనిఫెస్టోలో దళిత బంధు వచ్చిన వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వమని చెప్పారా సమాధానం ఇవ్వాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
Telangana CM: ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సామాజిక న్యాయం సమరభేరి సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరగబోతున్నాయి.. కొత్తగా ఎమ్మెల్యేలు వచ్చిన చోట బాధ పడకండి.. మీకు టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించే బాధ్యత పార్టీ తీసుకుంటుంది అని భరోసా ఇచ్చారు.