Health Tips: ఈ రోజుల్లో చాలా మందికి డైలీ హాట్ వాటర్ తాగే అలవాటు ఉండటం సాధారణంగా మారిపోయింది. అయితే హాట్ వాటర్ తాగే చాలా మంది వారికే తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లు వారి ఆరోగ్యంపై విశేషంగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇంతకీ ఆ తప్పులు ఏంటి, వాటితో ఆరోగ్యంపై ఏవిధంగా ప్రభావం పడుతుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Cinema 2025: నెట్‌లో ఎక్కువగా వెతికిన ‘టాప్ 10’ సినిమాలివే.. తెలుగులో ఒకటే!
అంటువ్యాధులు, సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కోసం ఈ రోజుల్లో చాలా మందికి హాట్ వాటర్ తాగడం ఒక రోజువారీ అలవాటుగా మారింది. పెరుగుతున్న ఆరోగ్య అవగాహన చాలా మంది దీనిని సురక్షితమైనదిగా భావించడానికి కారణం అవుతుంది. మారుతున్న జీవనశైలి, నీటి నాణ్యత గురించి ఆందోళనలు, అనారోగ్యాన్ని నివారించాలనే ఆలోచన కారణంగా హాట్ వాటర్ తీసుకోవడం తప్పనిసరి అయింది. అయితే ఒకసారి నీటిని మరిగించిన తర్వాత, అది అన్ని పరిస్థితులలోనూ సురక్షితంగా ఉంటుందని ప్రజలు అనుకుంటారు. ఈ ఆలోచనే సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సరైన అవగాహన లేకుండా చేసే చిన్న తప్పులు కూడా మీరు తీసుకునే హాట్ వాటర్‌ను ఆరోగ్యానికి హానికరం చేసేలా మారుస్తాయని చెబుతున్నారు.
ఆర్‌ఎంఎల్ హాస్పిటల్‌లోని మెడిసిన్ విభాగానికి చెందిన డాక్టర్ సుభాష్ గిరి మాట్లాడుతూ.. చాలా మంది హాట్ వాటర్‌ను మరిగించిన తర్వాత ఎక్కువసేపు, ఆ నీటిపై ఉన్న మూతను తెరిచి ఉంచుతారని, ఇది బ్యాక్టీరియా పెరుగుదల ప్రమాదాన్ని పెంచుతుందని వివరించారు. కొంతమంది శుభ్రమైన పాత్రలో కాకుండా అందుబాటులో ఉన్న ఏదైనా పాత్రలో వాటర్‌ను హీట్ చేసి, నిల్వ చేస్తారు. నిజానికి ఇది ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుందని, ఇంకా హీట్ చేసిన వాటర్‌ను పదేపదే హీట్ చేయడం ప్రమాదం అని హెచ్చరించారు. ఇది నీటి నాణ్యతను ప్రభావితం చేస్తుందని, అలాగే అనారోగ్యానికి కారణం అవుతుందని చెప్పారు. అలాగే చాలా మంది ప్రజలు తరచుగా ఎప్పుడో వేడి చేసిన నీటిని మూత లేకుండా తాగుతుంటారు. నిజానికి దీనివల్ల కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు లేదా గ్యాస్ వంటి సమస్యలు వస్తాయని వివరించారు. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు, పిల్లలు, వృద్ధులు దీంతో మరింత త్వరగా ప్రభావితం అవుతారని చెప్పారు. సరైన విధానాలను పాటించకపోతే, హాట్ వాటర్ ప్రయోజనాలను అందించడానికి బదులుగా ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని హెచ్చరించారు.
మరిగించిన నీటిని సురక్షితంగా ఉంచుకోడానికి, కొన్ని సాధారణ విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం అని సూచించారు. హాట్ వాటర్‌ను ఎల్లప్పుడూ శుభ్రమైన, మూత ఉన్న పాత్రలోనే నిల్వ చేయాలని అన్నారు. అలాగే ఎక్కువసేపు నిల్వ చేయకుండా ఉండటానికి అవసరమైనంత మాత్రమే హీట్ చేసుకోవాలని సూచించారు. ఒకే నీటిని పదే పదే వేడి చేయకుండా, నీళ్లు తాగాలనుకున్న ప్రతిసారీ హీట్ చేసుకోవాలని చెప్పారు. అలాగే ప్రతిరోజూ కూడా వాటర్‌ను హీట్ చేసే పాత్రను మంచిగా శుభ్రం చేసుకోవాలని, నీరు లేదా గ్లాసులను తాకేటప్పుడు శుభ్రతను పాటించాలన్నారు. తాగు నీటిలో ఎలాంటి మార్పును గమనించిన కూడా వాటిని తీసుకోవద్దని చెప్పారు. ఈ సాధారణ జాగ్రత్తలు పాటిస్తే హాట్ వాటర్‌తో ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదని చెప్పారు.
READ ALSO: Nani: జడల్ హడల్.. ఎందయ్యా నాని.. వాళ్లు ఏమైపోవాలి!