Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా టీమ్ ఒక సూపర్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ చిత్రం సమ్మర్‌లో థియేటర్లలోకి వచ్చేస్తోందని తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో పవన్ ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు. 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు, “ఈ సమ్మర్‌లో థియేటర్లలో కూర్చుని మాసివ్ ట్రీట్‌ను అనుభవించడానికి సిద్ధంగా ఉండండి” అంటూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
READ ALSO: Health Tips: హాట్ వాటర్ తాగే అలవాటు ఉందా? ఈ తప్పులు చేయకండి!
ఈ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ రెడ్ కల్లర్ షర్ట్, జీన్స్‌లో అదిరిపోయే స్టైల్‌లో కనిపిస్తున్నారు. ఒక చేత్తో గన్, మరో చేత్తో రేడియోను పట్టుకుని నడుస్తున్న లుక్.. ఫ్యాన్స్‌ను థ్రిల్ చేస్తోంది. ఈ పోస్ట్ రిలీజ్ చేసిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ యాక్షన్ కామెడీ డ్రామాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘దేఖ్‌లేంగే సాలా’ ఇప్పటికే సూపర్ హిట్ కాగా, ఆ పాటలో పవన్ డాన్స్ హైలైట్‌గా నిలిచింది. ‘గబ్బర్ సింగ్’ సినిమా తర్వాత పవన్ – హరీష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం.. ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి కావడంతో, ప్రస్తుతం జోరుగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ సాగుతున్నాయి. తాజా అప్‌డేట్‌తో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.
This SUMMER, get ready to be seated in theatres and experience a MASSIVE TREAT 🔥#UstaadBhagatSingh 💥💥
Happy New Year ✨
Cult Captain @harish2you's Feast
POWER STAR @PawanKalyan @harish2you @sreeleela14 #RaashiiKhanna @ThisIsDSP @rparthiepan @DoP_Bose #AnandSai @Venupro… pic.twitter.com/WAszWfetZe
— Ustaad Bhagat Singh (@UBSTheFilm) January 1, 2026
READ ALSO: Nani: జడల్ హడల్.. ఎందయ్యా నాని.. వాళ్లు ఏమైపోవాలి!