Off The Record: కాంగ్రెస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం ఆలస్యం వెనుక మర్మం?
- తెలంగాణ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న వాయిదాల పర్వం..
- పూర్తి స్థాయిలో పీసీసీ కమిటీ లేకుండానే నడుస్తున్న బండి..
- వర్కింగ్ ప్రెసిడెంట్స్ నియామకంపై అప్పట్లో హడావిడి..
- ముఖ్యులంతా కుస్తీలు పట్టినా బయటికి రాని జాబితా..
- నాలుగు రకాల కుల సమీకరణలపై అప్పట్లో కసరత్తు..
- ఇప్పుడసలు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల్ని వదిలేశారా అన్న డౌట్..
- ఇంకా పెండింగ్‌లోనే ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: అది అంతేనా… ఇక వదిలేశారా..? నడుస్తోంది కదా అని నడిపించేస్తున్నారా..? లేక ఎవరికి ఇవ్వాలో అర్ధంగాక గందరగోళంలో ఉన్నారా? వర్కింగ్ ప్రెసిడెంట్స్ విషయమై తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? నియామకం ఎందుకు ఆలస్యం అవుతోంది?
Read Also: Off The Record: దశాబ్దం తర్వాత ఆ బడా నేతలను ప్రోటోకాలే కలిపిందా?
Also Read
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- OTR : విజయనగరం టీడీపీలో మేయర్ సీటు ఎవరిదో..అధిష్టానం మనసులో ఉన్నదెవరు?
పోస్ట్ ఏదైనా… ప్రోగ్రామ్ ఏదైనా సరే… కాంగ్రెస్ పార్టీలో వాయిదాల పద్ధతి మాత్రం కామన్ అన్నట్టుగా ఉంది. పార్టీ పదవుల నుంచి మొదలుకుని… నామినేటెడ్ పోస్ట్‌ల దాకా… అన్నిటి విషయాల్లో ఇదే తంతు నడుస్తోంది. అసలు పీసీసీ కమిటీ వేయడానికే ఏడాది పట్టింది. దాన్ని కూడా పూర్తిస్థాయిలో వేయకుండానే ముగించేశారు. కమిటీలో ఇంకా భర్తీ చేయని పదవులు ఉన్నట్టో .. లేనట్టో కూడా ఎవరికీ అంతు చిక్కదు. అదిగో ఇదిగో అంటూ టైమ్ పాస్ చేస్తున్నారు తప్ప ఎక్కడా క్లారిటీ ఇవ్వడంలేదని మండి పడుతున్నారు ఆశావహులు. కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్స్ నియామకంపై అప్పట్లో చాలా హడావుడి జరిగింది. అప్పుడే జాబితా విడుదల అవుతుందనేలా షో చేశారు.
Read Also: Deva Katta: ఆదికి ఆయన కథకి ఓ బిగ్ సెల్యూట్!
అయితే, పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి… ఇలా అగ్రనేతలంతా హస్తినలో కుస్తీ పట్టారు. కానీ ఇప్పటి వరకు జాబితా బయటకు రాలేదు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ లను నియమించింది పార్టీ. కానీ మహేష్ గౌడ్‌ని పిసిసి చీఫ్ గా నియమించిన తరువాత ఏడాదికి ప్రధాన కార్యదర్శి… ఉపాధ్యక్ష పదవులు భర్తీ అయ్యాయి. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులకు మాత్రం ఇప్పటిదాకా అతీగతీ లేదు. సామాజిక సమీకరణల లెక్కలు వేస్తూ…. ఎస్సీ అయితే మాదిగలకు ఇవ్వాలని… ఓసీ కోటాలో రెడ్డికి ఒకటి, మైనార్టీలకు ఒకటి, ఎస్టీలకు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ లెక్కలేశారు. మాజీ MLA సంపత్, ఎస్టీ విభాగం చైర్మన్ బెల్లయ్య నాయక్ పేర్లపై చర్చించారు కూడా.
Read Also: Prabhas-JR NTR-Ram Charan : ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్.. బాలీవుడ్ డ్యామేజ్..
కాగా, మైనార్టీ నుండి గట్టిగా ఆశిస్తున్న ఓ నాయకుడి పేరు పై విస్తృత చర్చ జరిగింది. కానీ ఇన్ఛార్జ్ స్థాయిలో అడ్డుకట్ట వేశారనే ప్రచారం సాగింది. ఇంత జరిగినా… ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకోకపోవడం ఏంటన్నది బిగ్ క్వశ్చన్. నలుగురు కీలక నాయకులకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇవ్వడానికి పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారా..? లేదంటే అసలు ఆ పదవులు ఎందుకులే అని వదిలేశారా అంటూ ఇప్పుడు కొత్తగా అనుమానాలు వస్తున్నాయట పార్టీ వర్గాలకు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల భర్తీ అన్న సంగతిని పార్టీ పెద్దలు మర్చిపోయారన్న టాక్ వినిపిస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్స్‌తో పాటు… ప్రచార కమిటీ చైర్మన్ నియామకం కూడా అలాగే పెండింగ్ లో ఉంది. ఇలా పార్టీలో పదవుల భర్తీ లాంటి అంశాన్ని అధిష్టానం పక్కన పెట్టిందా..? రాష్ట్ర నాయకులు తమకు పదవులు వచ్చాయి కదా.. అని మిగిలిన వారి గురించి ఆలోచించడం మానేశారా అన్న చర్చ జరుగుతోంది. పదవులు భర్తీ చేయకుండా ఖాళీగా పెట్టుకుంటే ప్రయోజనం ఏముందన్నది నాయకుల ప్రశ్న.
తాజావార్తలు
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..