Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Revanth Reddy Says We Have Rewritten The History Of Agriculture In Telangana

Revanth Reddy: రాష్ట్రంలో కొత్త చరిత్ర రాశాం.. పాపాలు శాపాలై వెంటాడుతున్నా రాజీ పడలేదు!

Published Date :August 15, 2025 , 12:18 pm
By Sampath Kumar
  • సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన
  • తెలంగాణను దేశానికి రోల్ మోడల్‌గా నిలబెట్టాం
  • ఆ స్ఫూర్తితోనే తెలంగాణలో ప్రజా ప్రభుత్వం పని చేస్తోంది
  • రైతుల విషయంలో రాజీ పడలేదు
  • వ్యవసాయ చరిత్రను తిరగ రాశాం
Revanth Reddy: రాష్ట్రంలో కొత్త చరిత్ర రాశాం.. పాపాలు శాపాలై వెంటాడుతున్నా రాజీ పడలేదు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన అని, దీనికి చరిత్రే సాక్ష్యం అని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ.. తెలంగాణను 20 నెలల కాలంలోనే దేశానికి రోల్ మోడల్‌గా నిలబెట్టాం అని చెప్పారు. ద్విముఖ విధానంతో తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. తమ ఆలోచనలో స్పష్టత ఉందని, అమలులో పారదర్శకత ఉందన్నారు. అందరినీ కలుపుకుని, అద్భుతాలు సృష్టించే సమ్మిళిత అభివృద్ధి విధానాన్ని తాము ఎంచుకున్నాం అని సీఎం చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని సీఎం రేవంత్‌ ఆవిష్కరించారు. భారత ప్రజలకు 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.

‘దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలు త్యాగం చేసిన మహనీయులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర్య పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అహింసే అస్త్రంగా మహా సంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పంథాను పరిచయం చేసింది. మహాత్ముడి సారథ్యంలో బయట శతృవులైన బ్రిటీషర్లపై యుద్ధం గెలిచాం. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సారథ్యంలో ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం. ఆనాడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చేసిన ప్రసంగం కోట్ల మంది భారతీయులను ఐక్యం చేసి, లక్ష్యం వైపు నడిచేలా చేసింది. కేవలం ప్రసంగాలు ఇవ్వడంతోనే సరిపెట్టలేదు, ఆ దిశగా కార్యచరణ తీసుకుని దేశ పురోగతికి బలమైన పునాదులు వేశారు. దృఢమైన ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద, గణతంత్ర దేశంగా భారత్‌ను నిలబెట్టడంలో గొప్ప రాజనీతిజ్ఞత ప్రదర్శించారు. పంచవర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయ, పారిశ్రామిక, వైజ్ఞానిక, సాంకేతిక రంగాల్లో దేశాన్ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దారు. ఆ నాటి స్ఫూర్తిని, ఆ మహనీయుల వారసత్వాన్ని కొనసాగిస్తూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రభాగాన నిలబెట్టే లక్ష్యాలతో మేం పరిపాలన సాగిస్తున్నాం. స్వాతంత్ర్యం సిద్ధించే సమయానికి దేశం అల్లకల్లోల పరిస్థితుల్లో ఉంది. శూన్యం నుండి మన ప్రయాణం మొదలైంది. శిఖరాలే లక్ష్యంగా సంకల్పం తీసుకుని మన పెద్దలు ఈ దేశాన్ని ముందుకు నడిపించారు. ఈ రోజు మనం చూస్తున్న ఆధునిక భారతం ఐదేళ్లలోనో, పదేళ్లలోనో సాధించిన విజయం కాదు. దీని వెనుక 79 ఏళ్ల కఠోర శ్రమ ఉంది. ఎందరో గొప్ప నాయకుల త్యాగం, చెమట, రక్తం ఉంది. ఈ సుదీర్ఘ ప్రస్థానం తర్వాతే నేడు మనం ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తున్నాం. వారు అందించిన ఈ ఘనమైన వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లడం మన ముందున్న కర్తవ్యం. ఆ బాధ్యత నిర్వర్తించడంలో నేను సదా సిద్ధంగా ఉంటాను. ఆ స్ఫూర్తితోనే తెలంగాణలో ప్రజా ప్రభుత్వం పని చేస్తోంది’ అని సీఎం రేవంత్‌ చెప్పారు.

Also Read: Revanth Reddy: ప్రతిపక్షాలు హైడ్రాను అస్రంగా వాడుకుంటున్నాయి.. ప్రజలు పాలాభిషేకం చేస్తున్నారు!

‘2023 డిసెంబర్ 7న మేము బాధ్యతలు స్వీకరించగానే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం. ప్రజలు, ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా విధాన నిర్ణయాలు తీసుకున్నాం. రైతులు, మహిళలు, యువత భవితకు పెద్దపీట వేశాం. సామాజిక తెలంగాణ ఆవిష్కరణకు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. కుల గణనతో బలహీనవర్గాల వందేళ్ల కలను నిజం చేశాం. ఎస్సీ వర్గీకరణతో దశాబ్ధాల నిరీక్షణకు తెరదించాం. ఇవి గొప్ప నిర్ణయాలు మాత్రమే కాదు.. అత్యంత సాహసోపేత నిర్ణయాలు కూడా. ఒక వైపు ప్రపంచ నగరాలతో పోటీ పడే లక్ష్యాలు నిర్దేశించుకున్నాం. మరో వైపు పేదల ఆకాంక్షలు తీర్చే సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం. ద్విముఖ విధానంతో మా ప్రభుత్వం పాలన సాగిస్తోంది. మా ఆలోచనలో స్పష్టత ఉంది, అమలులో పారదర్శకత ఉంది. అందరినీ కలుపుకుని, అద్భుతాలు సృష్టించే సమ్మిళిత అభివృద్ధి విధానాన్ని మేం ఎంచుకున్నాం. పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ తెలంగాణను 20 నెలల కాలంలోనే దేశానికి రోల్ మోడల్ గా నిలబెట్టాం. సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన, దీనికి చరిత్రే సాక్ష్యం. 70 ఏళ్లుగా పీడీఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తోంది. అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీని ప్రారంభించింది. 13 వేల కోట్ల రూపాయల వ్యయంతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం. ఈ రోజు ధనికులతో సమానంగా పేదవారు సన్న బియ్యంతో భోజనం చేస్తున్నారు. ఇది కేవలం ఆకలి తీర్చే పథకం కాదు.. ఆత్మగౌరవాన్ని చాటి చెప్పే పథకం. ఈ పథకం అమలు తీరును నేను స్వయంగా పర్యవేక్షించా. ఆ రోజు వారి కళ్లలో కనిపించిన ఆనందం, ఆత్మగౌరవం నాకు శాశ్వతంగా గుర్తుంటుంది. రేషన్ కార్డు ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక. ఒక భరోసా.. భావోద్వేగం. ఆ భరోసా కోసం రాష్ట్ర ప్రజలు పదేళ్లు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. ప్రజా ప్రభుత్వం వచ్చాకే ఆ ఎదురుచూపులకు పరిష్కారం లభించింది. ఈ ఏడాది జూలై 14 నుంచి రాష్ట్రం వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించాం. పదేళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తోంది. పాడుబడి, మూతబడిన రేషన్ షాపుల తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి. పేదవాడి ఆశలు, ఆకలి తీర్చే భరోసా కేంద్రంగా నేడు గ్రామాల్లో రేషన్ షాపు పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ఇది మేం తెచ్చిన మార్పు’ అని సీఎం తెలిపారు.

‘తెలంగాణ రైతుకు 2022 మే 6న వరంగల్ వేదికగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మేం మాట ఇచ్చాం. గత ఏడాది ఇదే ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు, రూ.20,616 కోట్ల రుణమాఫీ చేసి కొత్త చరిత్ర రాశాం. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, గత పాలకుల పాపాలు శాపాలై వెంటాడుతున్నా.. రైతుల విషయంలో రాజీ పడలేదు. తెలంగాణ రైతును రుణ విముక్తి చేసి, దేశంలో అత్యధిక పంట పండిచే దిశగా ప్రోత్సహించాం. ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం ప్రకటించాం. కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. రాష్ట్రంలోని 70 లక్షల 11 వేల 184 మంది రైతులకు ఈ సాయం అందించాం. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1.2 లక్షల మంది రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించాం. పండించిన పంటను కొనుగోలు చేస్తూ మేం ఉన్నామన్న భరోసా ఇస్తున్నాం. 7,178 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ధాన్యం కొన్నాం. సన్నాలకు క్వింటాల్ కు రూ.500 బోనస్‌ ఇస్తున్నాం. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్లో భాగంగా 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. దీని కోసం రూ.16,691 కోట్ల సబ్సిడీని విద్యుత్తు సంస్థలకు చెల్లిస్తున్నాం. ఇది రైతుల పట్ల, వ్యవసాయం పట్ల మాకున్న చిత్తశుద్ధి. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగ రాశాం. అన్నదాతల సంక్షేమానికి రూ.1 లక్ష 13 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశాం. తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. దీనికి రూ.22,500 కోట్లు వెచ్చిస్తున్నాం. రాష్ట్రంలోని నాలుగు ఐటీడీఏ ప్రాంతాల్లో 22,016 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం. సామాజిక న్యాయం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది. స్థానిక సంస్థలలో, విద్యా, ఉద్యోగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లులను శాసనసభలో ఆమోదించుకున్నాం. 50 రోజుల పాటు సమగ్ర కులగణనను యజ్ఞంలా చేపట్టాం. దీని ఆధారంగా వారికి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం. రాష్ట్ర శాసన వ్యవస్థ ఆమోదించిన ఈ బిల్లులను ఆమోదించి, రిజర్వేషన్ల అమలుకు సహకరించాలని కేంద్రానికి పంపాం. మనం పంపిన బిల్లులపై సత్వరం నిర్ణయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మరోసారి డిమాండ్ చేస్తున్నాం. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రంలోని ఎస్సీల్లో ఉన్న 59 ఉప కులాలను మూడు గ్రూపులుగా విభజించాం. ప్రతి ఏటా ఫిబ్రవరి 4ను ‘తెలంగాణ సోషల్ జస్టిస్ డే’ గా జరుపుకోవాలని నిర్ణయించాం. మసకబారిన ఆరోగ్య శ్రీ పథకానికి పూర్వవైభవం తెచ్చాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరోగ్య శ్రీ పరిధిని రూ.5 నుండి 10 లక్షలకు పెంచాం. 27 ఎకరాల విస్తీర్ణంలో 2,700 కోట్ల రూపాయల వ్యయంతో నయా ఉస్మానియా ఆస్పత్రి భవన సముదాయాన్ని నిర్మిస్తున్నాం. రాష్ట్రంలో అనేక చోట్ల వైద్య విద్యా కళాశాలలు నిర్మిస్తున్నాం. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యారోగ్య రంగంపై 16 వేల 521 కోట్ల రూపాయలు వ్యయం చేశాం. మహిళా ఉన్నతి-తెలంగాణ ప్రగతి అనే నినాదంతో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో మేం పని చేస్తున్నాం. బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే మహాలక్ష్మీ పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించాం. ఈ పథకం కింద ఆడబిడ్డలకు రూ.6790 కోట్లు ఆదా అయ్యింది. ఇటీవలే 200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటడం మా విజయాలలో మరో మైలురాయి. రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధి కోసం మా ప్రభుత్వం మొత్తంగా 46,689 కోట్లు సమకూర్చింది. యువత తెలంగాణ శక్తికి ప్రతీక. గడచిన పదేళ్లలో యువతను మత్తుకు బానిసలను చేసే కుట్ర జరిగింది. ఆ కుట్రను మేం చేధించాం. ఇవ్వాళ తెలంగాణలో డ్రగ్స్ అనే మాట వినబడటానికి వీలు లేకుండా కఠినంగా వ్యవహరిస్తున్నాం. 20 నెలల కాలంలో దాదాపు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం’ అని సీఎం చెప్పుకొచ్చారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Agriculture Telangana
  • Independence Day 2025
  • revanth reddy
  • telangana
  • telangana development

తాజావార్తలు

  • Uppal Stadium: ఉప్పల్ స్టేడియం వద్ద ఫ్యాన్స్ ఆందోళన.. సిబ్బందిపై ఆగ్రహం..

  • Rini Sampath: వాషింగ్టన్ గడ్డపై చరిత్ర సృష్టించనున్న ఇండియన్ లేడీ.. ఎవరీ రిని సంపత్?

  • SRH Vs LSG: సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాటర్..

  • Train Coach: పెళ్లి కోసం ఏకంగా రైలు కోచ్ మొత్తాన్ని బుక్ చేసుకున్న కుటుంబం.. ఇలా బుక్ చేసుకునే వీలుందా?

  • Donald Trump: ‘‘దయచేసి ఆ పిచ్చివాడిని ఆపండి’’.. రష్యా, చైనాలను కోరిన IAEA మాజీ చీఫ్..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions