సూపర్ సిక్స్ సూపర్ హిట్.. దేశంలో రెట్టింపు స్థాయిలో సంక్షేమం ఏపీలోనే..
సూపర్ సిక్స్ సూపర్ హిట్.. దేశంలో రెట్టింపు స్థాయిలో సంక్షేమం కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. ప్రభుత్వ ప్రాధాన్యత స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో వివరించారు సీఎం చంద్రబాబు.. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి గత ప్రభుత్వం తీరు… ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు వివరించారు… ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీ4, రాజధాని అమరావతి.. పోలవరంపై సీఎం చంద్రబాబు వివరించారు… రాష్ట్ర అభివృద్ధికి నిత్యం కృషి చేస్తున్నామన్నారు.. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జెండా వందనం చేసిన చంద్రబాబు.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు… ప్రభుత్వం వివిధ పథకాలకు సంబంధించిన శకటాలు సీఎం చంద్రబాబు తిలకించారు.
జెండా పండుగ నాకో ఎమోషన్..
జెండా పండుగ అంటే నాకో ఎమోషన్ అన్నారు మంత్రి నారా లోకేష్. ఇండిపెండెన్స్ డే అనగానే నాకు స్కూల్ రోజులు గుర్తుకొస్తాయన్నారు.. గెస్ట్ జెండా ఎగరేసినప్పుడు గూస్ బంప్స్ వచ్చేవన్నారు.. 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరు పోలీసు పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ… స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు… దేశమంతా కలిసి చేసుకునే ఒకే ఒక్క పండుగ జెండా పండుగ. జెండా పండుగ నాకు ఒక ఎమోషన్. ఇండిపెండెన్స్ డే అనగానే నాకు నా స్కూల్ రోజులు గుర్తొస్తాయి. ఇండిపెండెన్స్ డే వస్తుంది అంటే ఒక హడావిడి ఉండేది. ఫ్రెండ్స్ అంతా కలిసి స్కూల్ ను డెకరేట్ చేసే వాళ్ళం. స్కూల్ లో పెట్టే కాంపిటీషన్స్ కోసం స్వాతంత్య్ర సమరయోధుల చరిత్ర గురించి తెలుసుకునే వాళ్ళం.. ఫైనల్ గా ఎవరైనా గెస్ట్ వచ్చి జెండా ఎగరేసినప్పుడు గూస్ బమ్స్ వచ్చేవి అని తన స్కూల్ డేస్ గురించి చెప్పుకొచ్చారు..
పవన్ సంచలన వ్యాఖ్యలు.. విదేశీ శక్తుల కనుసన్నల్లో అంతర్గత శత్రువులు పని చేస్తు్న్నారు..!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు పవన్ కల్యాణ్. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా కూడా పాల్గొన్నారు.. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. భారత్‌పై అంతర్జాతీయ కుట్ర చేయడానికి విదేశీ శక్తులు ప్రయత్నం చేస్తు్న్నాయ్నారు.. ఇక, విదేశీ శక్తుల కనుసన్నల్లో అంతర్గత శత్రువులు పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు.. జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఓడిపోయారు.. అందుకే ఎన్నికలపై ఆ విధంగా మాట్లాడుతున్నారు అంటూ కొన్ని పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు..
హిందూపురం అభివృద్ధిపై బాలయ్య కీలక వ్యాఖ్యలు
తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. రెండో రోజు పర్యటనలో భాగంగా.. హిందూపురం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనం ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నామంటే ఎంతోమంది త్యాగమూర్తుల ఫలితమే మనకి స్వాతంత్ర్య దినోత్సవం అన్నారు.. ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం.. అందులో పూజారిని మాత్రమే నేను అన్నారు.. గతంలో మా నాన్న ఎన్టీఆర్ ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తాను.. ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తాను అన్నారు.. ఇక, హిందూపురం త్వరలో అభివృద్ధి రంగంలో దూసుకెళ్తుందని తెలిపారు బాలయ్య.. ఈ ప్రాంతంలో ఎన్నో పరిశ్రమలు వస్తాయి. యువతకు ఉద్యోగ అవకాశాల కోసం ఎన్నో పరిశ్రమలు రానున్నాయన్నారు.. మొన్న ఢిల్లీ వెళ్లింది కూడా హిందూపురం అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని.. కేంద్ర మంత్రులతో మాట్లాడడం జరిగింది.. త్వరలో హిందూపురం రూపు రేఖలు మారనున్నాయన్నారు.. మరోవైపు, స్వాతంత్య్ర వేడుకల్లో నా ముందున్న చిన్నారుల కంటే నేనింకా చిన్నపిల్లవాడిని. వారి ఉత్సాహం చూస్తుంటే సంతోషం వేస్తుందన్నారు.. అటు సినిమా రంగంలోనైతే రాజకీయంగా మీ ఆశీస్సులు నాకు శ్రీరామరక్ష. ఈ రోజు మీ అందరి గుండెల్లో ఉన్నానంటే నాకు జన్మనిచ్చిన మా నాన్న స్వర్గీయ ఎన్టీరామారావు దీవెనలే.. ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను అన్నారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.
వృథా పోతున్న నీరే.. బనకచర్లపై తెలంగాణ అభ్యంతరం ఏంటి?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తూనే ఉంది.. అయితే, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.. బనకచర్లతో ఎవరికీ నష్టం జరగదు.. గోదావరి వృథా జలాలతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తాం.. బనకచర్ల ద్వారా గోదావరి వృథా జలాలు రాయలసీమకు మళ్లించాలని నిర్ణయించాం అన్నారు.. సముద్రంలోకి వృథాగా పోయే నీటినే వినియోగిస్తాం.. ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.. సముద్రంలోకి వృథా అవుతున్న నీటిని బనకచర్ల ప్రాజెక్ట్ ద్వారా వినియోగించుకుంటే తెలంగాణకి అభ్యంతరం ఏంటి..? అని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు నాయుడు..
పులివెందుల చరిత్రలో వైసీపీ ఓడిపోలేదు.. జడ్పీటీసీ ఎన్నికలపై పోరాటం కొనసాగుతుంది..
పులివెందుల చరిత్రలో వైసీపీ ఓడిపోలేదు.. జడ్పీటీసీ ఉప ఎన్నికలపై న్యాయ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి .. వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీల్లో జవాబుదారీతనం తగ్గుతోంది.. వైఎస్ జగన్ విలువలు విశ్వసనీయత కలిగిన వ్యక్తి.. ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా ప్రజలను మోసం చేయటం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారింది.. ఈవీఎంలతో మోసం చేసి గెలుపు సాధించారు.. 12.5 శాతం ఓట్లు ఎలా పెరిగాయో ఎవరూ సమాధానం చెప్పటం లేదన్నారు. జడ్పీటీసీ ఉప ఎన్నికలలో వ్యవస్థలను నిర్వీర్యం చేసారు.. ఎన్నికల్లో జగన్ సంయమనంతో వ్యవహరించారు.. కానీ, ఎన్నికల వ్యవస్థ గుడ్డిగా వ్యవహరించింది.. సీసీ పుటేజీ, వెబ్ కాస్టింగ్ ఇవ్వమంటే ఇవ్వలేదు… ఎన్నికలు పారదర్శకంగా జరిగితే ఎందుకు భయపడతారు.. వీటన్నిటిపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కొత్త చరిత్ర రాశాం.. పాపాలు శాపాలై వెంటాడుతున్నా రాజీ పడలేదు!
సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన అని, దీనికి చరిత్రే సాక్ష్యం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ.. తెలంగాణను 20 నెలల కాలంలోనే దేశానికి రోల్ మోడల్‌గా నిలబెట్టాం అని చెప్పారు. ద్విముఖ విధానంతో తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. తమ ఆలోచనలో స్పష్టత ఉందని, అమలులో పారదర్శకత ఉందన్నారు. అందరినీ కలుపుకుని, అద్భుతాలు సృష్టించే సమ్మిళిత అభివృద్ధి విధానాన్ని తాము ఎంచుకున్నాం అని సీఎం చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. భారత ప్రజలకు 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.
నేటి నుంచి అందుబాటులోకి ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్.. పూర్తి వివరాలు ఇవే
ఈరోజు, ఆగస్టు 15న, అంటే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్‌వేలు, హైవేలలో ప్రయాణాన్ని సులభతరం చేయడానికి FASTag వార్షిక పాస్ ను తీసుకొచ్చారు. హైవే యాత్ర యాప్‌లో అధికారిక బుకింగ్ జరుగుతోంది. ఈ వార్షిక పాస్ కేవలం రూ. 3,000 ఖర్చుతో ఎంపిక చేసిన రోడ్లపై ఏడాది పొడవునా టోల్-ఫ్రీ ప్రయాణ సౌకర్యాన్ని ప్రజలకు అందిస్తుంది. 1 సంవత్సరానికి 200 ట్రిప్ పరిమితితో వచ్చే ఈ పాస్ గురించి పూర్తి వివరాలు మీకోసం. ఫాస్టాగ్ వార్షిక పాస్ ఒక వాహనానికి మాత్రమే చెల్లుతుంది. ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ లింక్ చేయబడిన వాహనానికి మాత్రమే ఈ పాస్ పనిచేస్తుంది. మరొక వాహనానికి ఉపయోగిస్తే అది డీయాక్టివేట్ కావచ్చు. అలాగే, విండ్‌షీల్డ్‌పై ఫాస్టాగ్‌ను సరిగ్గా ఇన్‌స్టాల్ చేయడం ముఖ్యం, లేకుంటే అది బ్లాక్‌లిస్ట్ లోకి వెళుతుంది.
మరింత తగ్గిన గోల్డ్ ధరలు.. నేడు తులం ఎంతంటే?
బంగారం ధరలు ఊరటనిస్తున్నాయి. నేడు మరోసారి మరింత తగ్గుముఖం పట్టాయి. నేడు తులం గోల్డ్ ధర రూ. 110 తగ్గింది. కిలో సిల్వర్ ధర రూ. 100 పెరిగింది.హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,124, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,280 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 తగ్గింది. దీంతో రూ.92,800 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 110 తగ్గింది. దీంతో రూ. 1,01,240 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 92,950 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,390 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,26,100 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,16,100 వద్ద ట్రేడ్ అవుతోంది.
ధోనీ నన్ను జట్టు నుంచి తొలగించాడు.. నేరుగా సచిన్ దగ్గరికి వెళ్లా..!
భారత క్రికెట్ జట్టులో అత్యుత్తమ ఓపెనర్‌లలో వీరేంద్ర సెహ్వాగ్ ఒకడు. అప్పటి టాప్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. బ్రెట్ లీ లాంటి గ్రేట్ పేసర్ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ మొదటి బంతికే సిక్స్ కొట్టిన ఘటన వీరూది. బౌలర్ ఎవరైనా, ఎంతమంది ఫీల్డర్లు ఉన్నా.. బంతి ఆఫ్ సైడ్ నుంచి బౌండరీకి దూసుకెళ్లేది. సెహ్వాగ్ క్రీజులో ఉన్నాడంటే.. అప్పటి టాప్ బౌలర్లు కూడా భయపడేవారు. 2011 వన్డే ప్రపంచకప్ భారత్ గెలవడంతో వీరేంద్రుడు కీలక పాత్ర పోషించాడు. అయితే ప్రపంచకప్‌కు ముందు వన్డే క్రికెట్ నుంచి రిటైర్ కావాలని భావించాడట. అందుకు కారణం అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోనీ అని తాజాగా సెహ్వాగ్ తెలిపాడు.
రజినీకాంత్ ‘కూలీ’ని దాటేసిన ఎన్టీఆర్ ‘వార్ 2’
రెండు బిగెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలలైన వార 2, కూలీ సినిమాలు భారీ అంచనాలు మధ్య థియేటర్స్ లో అడుగుపెట్టాయి. కానీ రెండు ఒక రకమైన టాక్ తెచుకున్నాయి. రెండు సినిమాలలో కథ, కథనాలు ఆశించిన మేర లేవు. కూలీ ప్యూర్ మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కగా వార్ 2 స్పై యాక్షన్ సినిమాగా తెరకెక్కింది. అయితే ఈ రెండు సినిమాలకు నెగిటివ్ టాక్ అంతగా పనిచేయలేదని చెప్పాలి. ఉదయం ఆటలు నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా ఫస్ట్, సెకండ్ షోలు హౌస్ ఫుల్ బోర్డ్స్ పెట్టాయి రెండు సినిమాలు. తోలి రోజు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ డామినేషన్ చూపించింది. బుక్ మై షో లో గంటకు 34 వేల టికెట్స్ తో దూసుకెళ్ళింది. అలాగే వార్ 2 కు 32 వేలకు పైగా బుకింగ్స్ తో జోరు చూపించింది. అయితే సెకండ్ షోస్ నుండి వార్ 2 లీడ్ తీసుకుంది. నేడు రెండవ రోజు వార్ 2 గంటకు 62.44 వేల టికెట్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కూలీ 39.47 వేల బుకింగ్స్ తో డే 2 ని సాలిడ్ గా స్టార్ట్ చేసింది. మొదటి రోజు ఎన్టీఆర్ సినిమాను రజిని సినిమా డామినేట్ చేయగా రెండవ రోజు రజనీ సినిమాను ఎన్టీఆర్ సినిమా పూర్తిగా డామినేట్ చేసింది. అయితే మేజర్ కాంట్రిబ్యూషన్ హిందీ లాంగ్వేజ్ నుండి ఉండడం గమనార్హం. నేడు ఇండిపెండ్స్ డే పబ్లక్ హాలిడే కావడంతో రెండు సినిమాలను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్స్ కు క్యూ కడుతున్నారు. రాబోయే రెండు రోజులు కూడా వీకెండ్ కావడం రెండు సినిమాలకు కాస్త అడ్వాంటేజ్.
నాగ్ సర్.. ఇక ఆపేస్తే బెటర్!
తాను టాలీవుడ్ కింగ్ మర్చిపోయడా? లేదంటే, ఇక హీరోగా చేసింది చాలు అని అనుకుంటున్నాడా? అనేది అర్థం కాకుండా పోయింది. తన తోటి సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంటే.. నాగార్జున మాత్రం ఇతర సినిమాల్లో కీలక పాత్రలు చేయడం మొదలు పెట్టారు. ఊపిరి, దేవదాస్ లాంటి సినిమాలు చేసినప్పటికీ.. అవి మల్టీస్టారర్‌గా మెప్పించాయి. బ్రహ్మాస్త్రలో నటించినప్పటికీ.. అది బాలీవుడ్ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్‌గా నిలిచింది. చివరగా హీరోగా ‘నా సామిరంగ’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన కింగ్.. కుబేర సినిమాతో యూటర్న్ తీసుకున్నారు. వాస్తవానికైతే నాగార్జున కొత్త సినిమా కోసం అక్కినేని అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ మాత్రం చేయలేదు నాగ్. మధ్యలో బిగ్ బాస్‌తో బిజీ అయ్యారు. త్వరలోనే కొత్త సీజన్ హోస్టింగ్‌కు రెడీ అవుతున్నారు. కానీ హీరోగా సినిమా ప్రకటించడం లేదు. కుబేరలో మంచి క్యారెక్టర్ చేశాడని అనిపించుకున్నప్పటికీ.. కూలీలో మాత్రం విలన్‌గా ఎందుకు చేశాడా? అని ఫ్యాన్స్ కాస్త ఫీల్ అయ్యేలా చేశారు. ఈ సినిమాలో నాగార్జున ప్లేస్‌లో వేరు వారు ఎవరు ఉన్నా సరే సినిమా నడిచిపోయేది. ఎందుకంటే.. సైమన్ పాత్ర వల్ల నాగార్జునకు కొత్త వచ్చేది ఏమి లేనట్టుగానే ఆ పాత్రను ముగించాడు డైరెక్టర్ లోకేష్.
శ్రీలీల కారణంగా పోస్ట్ పోన్ అవుతోన్న మ్యూజికల్ లవ్ స్టోరీ
భూల్ భూలయ్యా3తో కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ చూసేశాడు బాలీవుడ్ యంగ్ స్టార్ కార్తీక్ ఆర్యన్. జోవియల్ క్యారెక్టర్లతో యూత్ ఆడియన్స్ ఫిదా చేస్తోన్న ఈ చాక్లెట్ బాయ్.. బడా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు కానీ ఈ ఏడాది ఫ్యాన్స్‌ను పలకరించడం కాస్త కష్టమే. దీనికి టాలీవుడ్ బ్యూటీ శ్రీలీలే కారణం. అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మ్యూజికల్ లవ్ స్టోరీకి బ్రేకులేసి.. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం షిఫ్టైంది మిస్ లీల. షూటింగ్స్‌పై ఎఫెక్ట్ పడటంతో రిలీజ్ డేట్ పై రిప్లేక్షన్ చూపించిందని బజ్. దీపావళికి రిలీజ్ చేస్తామనుకున్న ఈ బొమ్మ నెక్ట్స్ ఇయర్ వాలంటైన్స్ డే వీక్‌కు వెళ్లినట్లు టాక్.