Bhatti Vikramarka: కాంగ్రెస్ చింతన్ శిబిర్.. అంతా రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాల్టి నుంచి కాంగ్రెస్ చింతన్ శిబిర్ కార్యక్రమం ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈమేరకు కీసరలో రెండు రోజుల పాటు మేధోమథన సదస్సు జరగనుంది. ఉదయ్‌పూర్ తీర్మానాలపై చర్చించి వాటికి టీపీసీసీ ఆమోదం తెలుపుకుంటుంది. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా భవిష్యత్తు కార్యాచరణపై నేతలు చర్చించుకుంటారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కమ్ ఠాగూర్ హాజరు కానున్నారు.
2 రోజుల సమావేశాల్లో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ డిక్లరేషన్ పై చర్చించనున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలు కీలక అంశాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు చర్చించి తీర్మానాలు చేయనున్నారు.హైకమైండ్ ఆదేశాలతో పీసీసీ నేతలు 2 రోజుల పాటు చింతన్ శిబిర్ ఏర్పాటు చేశారు. కీసరలోని బాలవికాసలో నవ సంకల్ప్ చింతన్ శిబిర్ జరగనుంది. ఇందుకోసం పీసీసీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏఐసీసీ ఆమోదించిన 6 తీర్మానాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
Also Read
ఆరు కమిటీలలో ఒక్కో కమిటీలో 30 నుంచి 40 మంది నేతలున్నారు. ఆర్గనైజేషన్ కమిటీకి పొన్నాల లక్ష్మయ్య, యూత్ కమిటీకి దామోదర రాజనర్సింహ, ఎకానమీ కమిటీకి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొలిటికల్ కమిటీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అగ్రికల్చర్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సోషల్ జస్టిస్ కు వీహెచ్ లు కన్వీనర్లుగా ఉన్నారు.
మొదటి రోజు సమావేశాల్లో 6 కమిటీలు సమావేశమై..వారికిచ్చిన అంశాలపై రిపోర్ట్ ప్రిపేర్ చేయనున్నారు. రెండో రోజు 6 కమిటీల కన్వీనర్లు మొదటి రోజు తయారు చేసిన రిపోర్ట్ ను భట్టి నేతృత్వంలోని చింతన్ శిబిర్ నిర్వహణ కమిటీకి అందజేయనున్నారు. చివరగా చింతన్ శిబిర్ తీర్మానాలను ఆమోదించి ఏఐసీసీకి పంపనున్నారు. మొత్తం దాదాపు 150 మందికి మాత్రమే పీసీసీ ఆహ్వానం పంపింది. పార్టీ అధిష్టానం తరపున ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారని తెలుస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నందున ఈ సమావేశాలకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్ తో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వం వహించనున్నారు.
తాజావార్తలు
-
Mythri Ravi: ‘తారక్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’
-
Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
-
AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
-
Nagarjuna: ‘పాన్ ఇండియాతో తలనొప్పి.. నా టార్గెట్ తెలుగే.. నన్ను నిలబెట్టింది ఇక్కడి ప్రేక్షకులే’
-
AP High Court: పుంగనూరు, రాయచోటి ఘటనలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!