Telangana Government: నిఖత్ జరీన్, ఇషా సింగ్‌లకు భారీ నజరానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో బంగారు పతకాలు సాధించిన తెలంగాణ బిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచిన నిఖత్ జరీన్, ISSF షూటింగ్ పోటీల్లో స్వర్ణ పతకం గెలుచుకున్న ఇషా సింగ్‌లకు ఒక్కొక్కరికి రూ.2 కోట్ల నగదు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అంతేకాకుండా ఇంటి స్థలాన్ని కూడా కేటాయిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. జూబ్లీహిల్స్ లేదా బంజారాహిల్స్‌లో ఇంటి స్థలం కేటాయిస్తామని తెలిపింది.
కాగా ఇటీవల టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో నిఖత్ జరిన్ సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఫైనల్స్‌లో 52 కేజీల విభాగంలో థాయ్‌లాండ్‌కు చెందిన జుటామస్ జిటిపాంగ్‌ను 0-5తో చిత్తు చేసి బంగారు పతకం అందుకున్నది. దీంతో మేరీకోమ్, సరితాదేవి, జెన్నీ, లేఖ తర్వాత ప్రపంచ టైటిల్‌ను గెలుచుకున్న ఐదో భారతీయ మహిళా బాక్సర్‌గా జరీన్ నిలిచింది. అటు ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ ప్రపంచకప్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌లో హైదరాబాదీ అమ్మాయి ఇషా సింగ్ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
మరోవైపు గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా పద్మశ్రీ కిన్నెరమెట్ల మొగిలయ్యకు రూ.కోటి నగదు పురస్కారాన్ని ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పద్మశ్రీ మొగిలయ్య కోరుకున్నట్టుగా బీఎన్ రెడ్డి నగర్ కాలనీలో నివాస యోగ్యమైన ఇంటి స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!