Geetha Reddy: పబ్స్‌కి, డ్రగ్స్‌కి హైదరాబాద్ హబ్‌గా మారింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో అమ్మాయిల పరిస్థితి దారుణంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత గీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ బాలికపై అత్యాచార ఘటన కేసు రోజు రోజుకు విచిత్రంగా మారుతోందన్నారు. రాజకీయ నాయకుల పిల్లలను కాపాడాలని పోలీసులు చూస్తున్నారని ఆమె ఆరోపించారు. అమ్మాయి తండ్రి ఫిర్యాదు చేసినా మూడు రోజుల వరకు ఎందుకు పట్టించుకోలేదని గీతారెడ్డి పోలీసులను ప్రశ్నించారు. పబ్స్ కి , డ్రగ్స్ కి హైదరాబాద్ హబ్ గా మారిందన్నారు. అసలు పబ్స్ కి అనుమతులు ఉన్నాయా అంటూ ఆమె ప్రశ్నించారు. 2014లో మద్యంతో 10 వేల కోట్ల ఆదాయం ఉంటే.. ఇప్పుడు 34 వేల కోట్ల అదాయం వస్తోందన్నారు.
మైనర్ రేప్ కేసు విషయంలో ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు , వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కొడుకు ఉన్నారని ఆమె అన్నారు. నిందితుడు దుబాయ్ వెళ్తే ఏ విధంగా వెళ్లాడని ప్రశ్నించారు. ఎవరినో కాపాడటానికి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కాపాడాలని చూస్తున్నారని ఆరోపించారు. అమ్మాయి వీడియో రిలీజ్ చేసి ఆ కుటుంబం బయట తిరగకుండా చేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీలు రెండు ఒక్కటయ్యాయన్నారు. న్యాయవాదిగా పని చేసే రఘునందన్ రావుకు ఆడ బిడ్డలు లేరా.. ఆయనపై కూడా కేసు పెట్టాలన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
Also Read
- Hyderabad: భాగ్యనగరంలో గన్ కల్చర్ కలకలం.. పంజాగుట్ట బార్లో రివాల్వర్‌తో బెదిరింపులు..
- Heavy Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..
- HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
- Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ అకాడమిక్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 26 నుంచి ఆన్లైన్ క్లాసులు
Errabelli Dayakar Rao: కాంగ్రెస్, బీజేపీలు చెత్త పార్టీలు.. వాళ్లవల్లే ధరలు పెరిగాయి
న్యాయవాది వామనరావు దంపతులను రోడ్డుపై నరికి చంపేస్తే చర్యలు లేవని ధ్వజమెత్తారు. తాము ప్రశ్నిస్తుంటే అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.పోలీసులు హౌస్ అరెస్ట్ లు చేయడానికే పనికొస్తారని.. నిందితులని పట్టుకోవడానికి పని చేయరన్నారు. ఎంఐఎం నాయకులతో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు పరిచయాలు ఉన్నాయని గీతారెడ్డి ఆరోపించారు.
తాజావార్తలు
-
MS Dhoni: “డాక్టర్లపైనే నమ్మకం ఉంచా.. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తా”.. రిటైర్మెంట్పై ధోనీ సంచలన ప్రకటన
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ భవితవ్యం.. రేపు ‘‘పరువు నష్టం’’ కేసులో కోర్టు తీర్పు..
-
Nothing Phone (5) Pro: నథింగ్ Phone (5) Pro, Phone (5) ఫస్ట్ లుక్.. 144Hz డిస్ప్లే, 8K వీడియో, భారీ బ్యాటరీ?
-
Rob Walter: రెండు మ్యాచ్‌లలో గెలిచేవాళ్లం.. ఈ ఒక్క కారణంతోనే ఓడిపోయాం.. కివీస్ హెడ్ కోచ్ ఆవేదన..
-
Mann Ki Baat: ‘వోకల్ ఫర్ లోకల్’తో ప్రపంచ మార్కెట్లలోకి భారత ఉత్పత్తులు!.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!