తెలంగాణలోకి బుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి.. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది.. మొన్న రాత్రి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవగా.. మంగళవారం పరిస్థితి భిన్నంగా ఉంది.. పగటిపూట ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగిపోయాయి.. అయితే, రాత్రి నుంచి మళ్లీ పరిస్థితి మారిపోయింది.. అక్కడక్క వర్షం కురిసింది.. మరోవైపు, ఇక నుంచి వర్షాలు దంచికొట్టే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉదయం నుంచే హైదరాబాద్ సహా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు…
రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడింది.. ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం.. ఇవాళ్టి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది.. మరోసారి ఏకగ్రీవంగా రాష్ట్రపతిని ఎన్నుకోవాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు సాగిస్తుండగా.. ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు విపక్షాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అందులో భాగంగా టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ ఢిల్లీ వేదికగా కీలక సమావేవాన్ని ఏర్పాటు చేశారు.. బీజేపీయేతర పక్షాలకు చెందిన 20 మందికి పైగా నేతలకు…
★ ఏపీ అసెంబ్లీలో ఉదయం 11 గంటలకు హౌస్ కమిటీ భేటీ.. భూమన కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన హౌస్ కమిటీ సమావేశం.. పెగాసస్ వ్యవహారంపై చర్చించనున్న హౌస్ కమిటీ.. ఇవాళ హోంశాఖతో పాటు వివిధ శాఖలతో కమిటీ భేటీ ★ అమరావతి: నేటి నుంచి చంద్రబాబు జిల్లా పర్యటనలు… నేడు అనకాపల్లి జిల్లా చోడవరంలో మినీ మహానాడు.. ఎన్టీఆర్ స్ఫూర్తి-చంద్రన్న భరోసా పేరుతో చంద్రబాబు రాష్ట్ర వ్యాప్త పర్యటనలు ★ తిరుమల: నేడు ఆన్లైన్లో అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల..…
వేసవి వేడి నుంచి కాస్త ఉపశమనం కలుగుతోంది. నిన్న తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు… మరింత బలపడి మరో మూడు రోజుల్లో రాష్టాన్ని పూర్తిగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్టానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఈ రోజు, రేపు రాష్టంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ రోజు ఈశాన్య, పశ్చిమ జిల్లాలో భారీ వర్షాలు పడనున్నాయి. రేపు ఉత్తర జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ వుందని వాతావరణ శాఖ అధికారులు…
సీఎం కేసీఆర్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏం మాట్లాడుకున్నారు? ఇద్దరి భేటీపై ఎందుకు ఆసక్తి రేగుతోంది? ఉండవల్లి తదుపరి రాజకీయం ప్రయాణం ఏంటి? కేసీఆర్, ఉండవల్లి రాజకీయంగా కలిసి నడుస్తారా? లెట్స్ వాచ్..! కేసీఆర్‌తో ఉండవల్లి భేటీపై ఆసక్తికర చర్చ ఉండవల్లి అరుణ్ కుమార్. మాజీ ఎంపీ. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సడెన్‌గా హాట్ హాట్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత సైలెంట్‌గా ఉంటూ.. కీలక అంశాలపై అప్పుడప్పుడూ మీడియా…
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి నిర్వాసిత గ్రామవాసులపై పోలీసులు లాఠీఛార్జి చేయడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న గౌరవెల్లి భూ నిర్వాసితులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జి చేయడం దారుణమని అన్నారు. లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంలో సీపీఐ పాత్ర కూడా ఉందని, అక్కడ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా తమ పార్టీ కాపాడిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం…
ధరణి పోర్టల్ ఒక అద్భుతం అని మంత్రి హరీష్ రావు అన్నారు. మంగళవారం ఉదయం ములుగు మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ధరణి పోర్టల్ అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో ధరణి పోర్టల్ సమస్యలపై హరీష్‌రావు ముఖా ముఖి నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ములుగు గ్రామ రెవెన్యూ సమస్యలు తీర్చి ఇదే విధంగా రాష్ట్రం అంత చేద్దాం అని ఆలోచన ఉందన్నారు. గతంలో రిజిస్ట్రేషన్ కోసం అనేక సమస్యలు ఉండేదని తెలిపారు. ధరణి వచ్చాక…
సీఎం కేసీఆర్, ప్రభుత్వ పథకాలను కించపరిచినందుకు బీజేపీ నేతలు రాణి రుద్రమ్మ, దరువు ఎల్లన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నాగోల్ బండ్లగుడలో ఏర్పాటు చేసిన ‘అమరుల యాది’లో అనే సభలో కేసీఆర్, ప్రభుత్వ పథకాలను కించపరిచే విధంగా చేసిన స్కిట్ విషయంలో రాణి రుద్రమ్మ, ఎల్లన్నని హయత్ నగర్ పోలీస్‌లు ఈ రోజు అరెస్ట్ చేశారు. అలాగే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కి బండి సంజయ్ కి…
రాష్ట్రపతి ఎన్నికల తరుణంలో దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. ఓవైపు థర్డ్ ఫ్రంట్, కొత్త పార్టీ ఏర్పాటు వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ అడుగులు వేస్తుంటే.. మరోవైపు.. ఎన్డీయేతర పార్టీలను ఏకం చేసే పనిలో పడిపోయారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. దీనికోసం ఈ నెల 15న ఢిల్లీ వేదికగా కీలక సమావేశం నిర్వహించనున్నారు.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని విపక్షాలకు పిలుపునిచ్చిన దీదీ.. తాను ఏర్పాటు చేసే సమావేశానికి రావాల్సిందిగా 22…
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గాడిలో పెట్టి.. లాభాల బాట పట్టించేందుకు టీఎస్ ఆర్టీసీ తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది… వినూత్న తరహాలో కొత్త పథకాలకు శ్రీకారం చుడుతూనే.. మరోవైపు పెరిగిన డీజిల్ ధరలకు అనుగుణంగా సంస్థపై భారం పడకుండా చార్జీలను కూడా వడ్డిస్తోంది.. అయితే, ఇది ఏపీఎస్ ఆర్టీసీకి కలిసివచ్చినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.. టీఎస్ ఆర్టీసీ సర్వీసుల్లో చార్జీలు పెరడంతో.. ప్రయాణికులు క్రమంగా ఏపీ ఆర్టీసీ సర్వీసులను ఆశ్రయిస్తున్నారట.. దీంతో, ఏపీ-తెలంగాణ మధ్య తిరిగే సర్వీసుల్లో చార్జీలు పెంచాలని…