రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు అవుతుంటాయి. వీటన్నింటిని ప్రజా ప్రతినిధుల కోర్ట్ విచారణ జరుపుతుంటుంది. అయితే తాజాగా ప్రజా ప్రతినిధుల కేసుల విషయంలో కీలక మలుపు ఎదురైంది. ఏకంగా కోర్ట్ 395 కేసుల్లో 380 కేసులను కొట్టేసింది. ఈ కేసుల్లో సరైన ఆధారాలు చూపడంలో పోలీసులు విఫలం అయ్యారని కోర్ట్ కేసులను కొట్టేసింది. మిగిలిన 14 కేసుల్లో 4 కేసుల్లో శిక్ష.. అలాగే 10 మందికి జరిమానా విధించింది. శిక్ష పడిన వారు హైకోర్ట్…
మహిళల భద్రతపై, సమస్యలపై రోశయ్య హాయాంలో సమావేశం జరిగిందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ 8 ఏళ్లలో ఒక్కసారి కూడా సమావేశం పెట్టలేదని విమర్శించారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్. ప్రతిపక్ష నాయకులు ప్రగతి భవన్ కు ఎలా వచ్చారని సమీక్ష చేసుకుంటారు కానీ.. తెలంగాణలో మహిళలపై దాడి చేస్తే సమీక్ష ఎందుకు చేయరని ప్రశ్నించారు. సీఎంకు తన భద్రత మీద ఉన్న శ్రద్ధ.. మహిళల భద్రతపై లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఆయన గురించే ఆలోచిస్తున్నారు..ఆయన గురించే…
ప్రతిభకు ఆకాశమే హద్దు.. కష్టపడితే ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతం అని సూచించారు మంత్రి కేటీఆర్.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రతిభకు ఆకాశమే హద్దు.. వచ్చే మూడు నాలుగు నెలలు మొబైల్ వాడకాన్ని తగ్గించండి.. 3 నెలలు ప్రణాళిక బద్ధంగా కష్టపడి చదివితే ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు…
గత కొన్ని నెలలుగా శ్రీలంకలో ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. దీంతో అక్కడి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాపారవేత్త శ్రీలంక ప్రజలకు డబ్బులు పంచుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రవీందర్ రెడ్డిని ఇటీవల శ్రీలంక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్ (సీఐడీ) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీలంక ప్రజలకు ఆయన రూ.5 లక్షలు పంచుతుండగా సీఐడీ అధికారులు ప్రశ్నించి వదిలేసినట్లు రవీందర్‌రెడ్డి…
తెలంగాణలో వరుసగా జరుగుతోన్న ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు ప్రొఫెసర్ హరగోపాల్.. చదువుకుంటున్న పిల్లలు కూడా నేరాల్లో పాల్గొంటుంటే… టీచర్లుగా మా కర్తవ్యం మేం చేస్తున్నామా అనే డౌట్ వచ్చిందన్నారు. ప్రభుత్వం నేరాలు కంట్రోల్ చేయకుండా.. నేరం చేస్తుందని దుయ్యబట్టిన ఆయన.. రాజకీయ పార్టీలు.. సమాజానికి ఏం విలువలు ఇస్తున్నాం అనేది చూసుకోవాలని సూచించారు. నగరంలో జరుగుతున్న ఘటనలు… అధికార పార్టీ తీరు మాకు కొంత విషాదకరంగా ఉందన్న హరగోపాల్.. తెలంగాణ వస్తే మెరుగైన సమాజం వస్తుంది…
గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాహితులపై కేసీఆర్ ప్రభుత్వానికి ఎందుకంత కక్ష? అని ప్రశ్నించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జిని ఆయన ఖండించారు. అర్ధరాత్రి సమయంలో గుడాటిపల్లికి వెళ్లి బాధిత నిర్వాసితులను పరామర్శించారు బండి సంజయ్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో గౌరవెల్లి రిజర్వాయర్ నిర్వాసితులపై మరోసారి లాఠీఛార్జ్ జరిగింది. హుస్నాబాద్‌లో ఎమ్మెల్యే సతీష్ కుమార్ క్యాంప్ ఆఫీస్ ముట్టడించేందుకు భూ నిర్వాసితులు ప్రయత్నించారు. ఎక్కడికక్కడ ఆందోళనకారులను అడ్డుకున్నారు పోలీసులు. హుస్నాబాద్ బస్టాండ్ దగ్గర్లో ధర్నాకు…
బాసర ట్రిపుల్ ఐటీలో రెండవ రోజు విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది.. తరగతులు బహిష్కరించి ప్రధాన గేటు వద్దకు ఆందోళన చేయడం కోసం వస్తున్నారు విద్యార్థులు.. అయితే, విద్యార్థులను కొద్ది దూరంలోనే అడ్డుకున్నారు పోలీసులు, సెక్యూరిటీ… ఇక, ట్రిపుల్ ఐటీ నిరసనపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు మంత్రి కేటీఆర్.. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు భరోసా ఇచ్చారు మంత్రి కేటీఆర్. తమ సమస్యలపైన స్పందించాలని విజ్ఞప్తి చేసిన విద్యార్థికి సమాధానమిచ్చారాయన. బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలను ముఖ్యమంత్రి…
సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.. ఈ కేసులో ఇప్పటి వరకు 17 మంది సాక్షులను గుర్తించి, 7 మందిని విచారించారు పోలీసులు.. మైనర్ బాలికను తీసుకెళ్లిన బెంజ్ కారును మైనర్ నడిపినట్లు గుర్తించారు. బెంజ్ కారు యజమానిపై కేసు నమోదు moFeki జూబ్లీహిల్స్ పోలీసులు.. అత్యాచారం జరిగిన ఇనోవా వాహనం వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మసి ఉల్లాఖాన్ కారుగా తేల్చారు. డ్రైవర్‌తో పాటు ఇనోవా కారు…
సైబర్ నేరస్థులు పంథా మార్చి ప్రజలను వంచిస్తున్నారు. మెట్రోనగరాలతో పాటు అమెరికాలో నివసిస్తున్న తెలుగువారి ఫోన్ నంబర్లు తెలుసుకుని వారిని తమ వాట్సాప్ బృందాల్లోకి చేర్చుకుంటున్నారు. లక్షల్లో లాభాలొస్తాయని నమ్మిస్తున్న అక్రమార్కులు వాటిని బాధితులు తీసుకున్నాక లక్షలు కొల్లగొడుతున్నారు. అలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగింది. క్రిప్టో ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ అడ్వొకేట్‌తో పాటు మరో వ్యక్తిని మోసం చేసి రూ.65 లక్షలు కాజేశారు. హైదరాబాద్ వారసిగూడ చెందిన ఓ అడ్వొకేట్‌ను సైబర్ చీటర్స్ వాట్సప్…