ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్రయోజనాలకు పాకులాడే వ్యక్తి అని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే విమర్శించారు. ఆదివారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. అక్కడే కేంద్ర పథకాల లబ్ధిదారులతో సమావేశం అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి సెక్రటేరియట్ లేదు.. ఫామ్ హౌస్ నుంచి పరిపాలన కొనసాగిస్తున్నారని విమర్శలు గుప్పించారు మహేంద్ర నాథ్ పాండే. ఇక్కడ గెలవలేని వారు జాతీయస్థాయిలో వెలుగుతారా.? అని ప్రశ్నించారు. ఆయనతో దేశం ఎలా ముందుకు వెళ్తుందని అడిగారు.…
తెలంగాణలో ఆదివారం పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. లోకల్ బాడీస్ కు అధికారులుగా ఉన్న పలువురు ఐఏఎస్ అధికారులకు కలెక్టర్ గా పదోన్నతి పొందారు. సంగారెడ్డి కలెక్టర్ గా ఉన్న ఏ. శరత్, సిద్ధిపేట కలెక్టర్ గా ప్రశాంత్ జీవన్ పాటిల్, గద్వాల కలెక్టర్ గా కోయ శ్రీహర్ష, నల్గొండ కలెక్టర్ గా రాహుల్ శర్మ, ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా వరణ్…
తెలంగాణకు వరుసగా భారీ పెట్టుబడులు వస్తున్నాయి. తాజాగా రాష్ట్రానికి మరో భారీ పరిశ్రమ రానున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. స్మార్ట్‌టీవీలు, మొబైల్ఫోన్లకు అత్యంత ఆధునికమైన డిస్ప్లేలను తయారు చేసే సంస్థ అమోలెడ్ ఇండియాలోనే అతి పెద్ద పరిశ్రమను హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని తెలిపారు. ఫార్చూన్ 500 కంపెనీల్లో ఒకటిగా ఉన్న రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ (ఎలెస్ట్) అమోలెడ్ డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ తయారీ యూనిట్‌ను తెలంగాణలో స్థాపించనుందని.. ఇందుకోసం రూ.24వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు మంత్రి కేటీఆర్…
ఓ వైపు కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం మళ్లీ తల్లిదండ్రుల్లో ఆందోళనలు పెంచుతున్నాయి. ఈ ఏడాది కూడా తమ పిల్లల చదువులు అంతంత మాత్రంగానే సాగుతాయా.? అనే భయాందోళల్లో తల్లిదండ్రులు ఉన్నారు. రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం అవుతాయా.? లేదా.? అనే సందేహాలు తలెత్తాయి. అయితే జూన్ 13 నుంచి యాథాతథంగా స్కూళ్లు ప్రారంభం అవుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. సెలవులను పొడగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపటి నుంచి…
కొత్తగా చేరే ప్రభుత్వ వైద్యులకు ప్రయివేట్ ప్రాక్టీస్ రద్దు అంశం పై తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్, మెడికల్ టీచింగ్ అసోసియేషన్, IMA, సీనియర్ రెసిడెనెస్ డాక్టర్స్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ డాక్టర్ అసోసియేషన్, హేల్త్ కేర్ రిఫ్సర్మ్స్ డాక్టర్ అసోసియేషన్, ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రయివేట్ వేట్ ప్రాక్టీస్ అంశం ఎవరి అభిప్రాయం తీసుకుకోకుండా ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు. ప్రైవేటు ప్రాక్టీసు రద్దు వల్ల డాక్టర్లతో…
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ పటిష్టత కోసం ఆ పార్టీ నాయకత్వం కృషిని ప్రారంభించింది. పార్టీలో అసంతృప్తి వాదులుగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి లు పార్టీ కార్యాలయానికి వచ్చేలా చేయడంలో కేటీఆర్ సక్సెస్ అయ్యారు. ఇది పార్టీ లో ఒక్కవిజయంగా కూడా చెప్పవచ్చు. ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాల్లోనే ఉన్నప్పటికి పార్టీలో ఎటువంటి పదవులు లేకుండా ఉన్న వారిని కూడా దగ్గరకు తీసుకునే చర్యలు పార్టీ చేపట్టినట్లుగా అయ్యింది. పోలీసుల వినియోగాన్ని…
నిజామాబాద్ జిల్లా పర్యటనకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో ఆయనను ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి మంత్రి మహేంద్రనాథ్ పాండే ఆరా తీయగా, జిల్లాలో కేంద్ర పథకాల అమలు సమర్థవంతంగా జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. ముద్ర రుణాల పంపిణీలో నిజామాబాద్…
జీవితమే ఒక పరీక్ష. అందులో మనం పరీక్ష రాస్తూనే వుంటాం. ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలకు హాజరవుతూనే వుంటాం. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్ష నిర్వహిస్తోంది. ఒక్క నిముషం ఆలస్యం అయినా చాలామందికి పరీక్ష రాసే అవకాశం లభించలేదు. పరీక్ష కేంద్రం వద్ద చంటి పిల్లలతో ఎగ్జామ్ రాయటానికి వచ్చిన తల్లులు ఉయ్యాలలు ఏర్పాటు చేసుకున్నారు. తల్లులతో పాటు వారి భర్తలు, కుటుంబ సభ్యులు తోడుగా వచ్చారు. చంటి పిల్లల్ని తమ బంధువులకు అప్పగించిన తల్లి…
వాతావరణ శాఖ రైతన్నలకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలోకి రేపు (సోమవారం) నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలున్నాయని పేర్కొంది. గోవా, కొంకణ్, కర్నాటక ప్రాంతాల్లో శనివారం నాటికి విస్తరించాయని తెలిపింది. పశ్చిమ భారత తీర ప్రాంతాల్లో విస్తరించిన నేపథంలో ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయని అంచనా వేస్తున్నది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని.. వీటి ప్రభావంతో…
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు మరోసారి షాక్ ఇచ్చింది. రాజధానిలో నేడు టెట్, ఆర్ఆర్బీ పరీక్షలు ఉన్నప్పటికీ వివిధ మార్గాల్లో ఎంఎంటీఎస్ (MMTS) సర్వీసులను రద్దు చేసింది. సాంకేతిక కారణాల వల్ల 34 ఎంఎంటీఎస్ సర్వీసులను నిలిపివేస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఇందులో లింగంపల్లి-హైదరాబాద్ మార్గంలో 9 సర్వీసులు, హైదరాబాద్-లింగంపల్లి మార్గంలో 9 సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి మార్గంలో 7 సర్వీసులు, లింగంపల్లి-ఫలక్‌నుమా మార్గంలో 7 సర్వీసుల చొప్పున ఉండగా, సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో, లింగంపల్లి-సికింద్రాబాద్ మార్గంలో ఒక్కో సర్వీసు…