CPI Narayana: లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి నిర్వాసిత గ్రామవాసులపై పోలీసులు లాఠీఛార్జి చేయడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న గౌరవెల్లి భూ నిర్వాసితులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జి చేయడం దారుణమని అన్నారు.
లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంలో సీపీఐ పాత్ర కూడా ఉందని, అక్కడ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా తమ పార్టీ కాపాడిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం జరిగేంత వరకు అక్కడ కుర్చీ వేసుకుని కూర్చుని ప్రాజెక్టు నిర్మాణం చేస్తానని చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్ మాటలు ఏమయ్యాయని, ఆయన కుర్చీ ఎక్కడ పోయిందని ఎద్దేవా చేశారు.
Also Read
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
- HYDRA Ranganath: నేను చట్టపరిధిలోనే పనిచేస్తున్నా, పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి లేదు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని మండిపడ్డారు. గౌరవెల్లి భూ నిర్వాసితులకు న్యాయం చేసేంతవరకు సీపీఐ పోరాడుతుందని చెప్పారు. కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు గౌరవెల్లిలో కుర్చీ వేసుకుని కూర్చుని బాధితులకు న్యాయం చేయాలని నారాయణ అన్నారు.
తాజావార్తలు
-
Kalyani Priyadarshan: రణవీర్ సింగ్ ‘ప్రళయ్’లో కళ్యాణి ప్రియదర్శన్? బాలీవుడ్లో మరో పెద్ద అవకాశం దక్కనున్నదా!
-
Astrology: జూలై 23 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..!
-
Samsung Galaxy Z Flip 8: 4300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సామ్ సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 8 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!