Weird Weather: తెలంగాణ రాష్ట్రంలో విచిత్ర వాతావరణం కొనసాగుతుంది. కొన్ని జిల్లాల్లో ఎండలు మండిపోతుండగా.. మరికొన్ని జిల్లాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. అయితే, ఒకే సారి ఎండ, వాన రావడంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు.
తెలంగాణ రాష్ట్రం మరోసారి భారీ వర్షాల ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు తెలిపారు.
Rain Alert: రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తా జిల్లాలలో భారీగా వర్షం కురుస్తుండగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రాష్ట్రం మొత్తం వరుణిడికి దెబ్బకి అతలాకుతలమయ్యింది. ఇక తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం సంగతి గురించి చెప్పనక్కర్లేదు. కొద్దిపాటి వర్షం పడితేనే జలమయమయ్యే రోడ్లతో ఇబ్బంది పడే నగరవాసులు ఇప్పుడు కుండపోత వర్షం కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. illicit Affairs: తిరుపతిలో దారుణం.. కూతురు ముందే అల్లుడితో పెళ్ళికి…
తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం, రాగల కొన్ని గంటల్లో రాష్ట్రంలోని దక్షిణ జిల్లాలైన మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. సాయంత్రం వేళల్లో మొదలవుతున్న ఈ భారీ వర్షాలు నగరాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. నిన్న కురిసిన కుండపోత వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
తెలంగాణ రాష్ట్రంకు వాతావరణ శాఖ భారీ హెచ్చరిక జారీ చేసింది. రానున్న 3 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా కరీంనగర్, ములుగు, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. తప్పనిసరి అయితేనే బయటికి రావాలని ప్రజలకు సూచింది. Also…
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి కురిసిన వర్షం నగర వాసులను వణికించింది. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా కుండపోత వర్షం పడింది. భారీగా కురిసిన వానతో రోడ్లు కాలువలను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై చెరువులను తలపించాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలోని నాలాలు పొంగిపొర్లాయి. నాలాల్లో పడి పలువురు కొట్టుకుపోయారు. ఆసిఫ్ నగర్ అఫ్జల్ సాగర్ మంగారు బస్తిలో విషాదం చోటుచేసుకుంది. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి…