Heavy Rains: హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్ర ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడి, ఈశాన్య దిశగా కదులుతున్న ‘మొంథా’ తుఫాన్ అర్ధరాత్రి తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తీరాన్ని తాకే సమయంలో తుఫాన్ తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ తుఫాన్ ప్రభావం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోంది. హైదరాబాద్ సహా అనేక జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. నగరంలోని కుత్బుల్లాపూర్, గాజులరామారం, కూకట్‌పల్లి, మియాపూర్, నిజాంపేట్, అల్వాల్, కాప్రా వంటిచోట్ల ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. అంబర్‌పేట్, జూబ్లీహిల్స్, బంజారహిల్స్, గచ్చిబౌలి, లింగంపల్లి, మాధాపూర్, హైటెక్‌సీటీలో సైతం వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లపైకి నీరు చేరి వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
READ MORE: Mass Jathara : నా ఫ్యామిలీని బతికించింది రవితేజనే.. భీమ్స్ ఎమోషనల్
ఈ మొంథా తుఫాన్ ఎఫెక్ట్ ఉమ్మడి ఖమ్మం జిల్లాపై అధిక ప్రభావం చూపుతోంది. జిల్లా వ్యాపితంగా కురుస్తున్న వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా మోస్తారుగా వర్షం కురుస్తోంది. పాలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 22.5 అడుగుల నీటి నిల్వ ఉంది. గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల వల్ల వరి పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.. భారీ వర్షాలతో మణుగూరు ఇల్లందు సత్తుపల్లిలలో ఓపెన్ కాస్ట్ ల్లోకి వర్షపు నీరు చేరి బొగ్గు ఉత్పత్తి తగ్గింది.
READ MORE: Breaking News: గాజాపై శక్తివంతమైన దాడులకు నెతన్యాహూ ఆదేశాలు..
మరోవైపు.. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, ఈ రెండు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసినట్లు ఐఎండీ (IMD) తెలిపింది. అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా బయటకు వెళ్లరాదని సూచించింది. అలాగే, రాష్ట్రంలోని పలు ఇతర జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ కూడా ప్రకటించబడింది. వచ్చే గంటల్లో గాలివానలు, పిడుగులు, భారీవర్షాలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.