Rain Alert : వదలా అంటున్న వానలు.. ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలే..!
- బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాయుగుండంగా మారే అవకాశం
- ఏపీలో వారం రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
- తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాల సూచన
- ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rain Alert : ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను వరుణుడు ఏమాత్రం వదిలిపెట్టడం లేదు. మొన్నటి వాయుగుండం ప్రభావం పూర్తిగా తగ్గక ముందే.. మరో అల్పపీడనం కదలికలు ప్రారంభించింది. ఇది వాయుగుండంగా మారే అవకాశముందని, వచ్చే నాలుగు రోజులపాటు రెండు రాష్ట్రాల్లోనూ వర్షాలు తప్పవని వాతావరణశాఖ హెచ్చరించింది.
గత కొన్ని నెలలుగా ఏపీ, తెలంగాణలో వర్షాలే ప్రధాన సమస్యగా మారాయి. కాలం మారినా వానలు మాత్రం ఆగడంలేదు. కొన్నిచోట్ల కుండపోతగా కురుస్తూ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఇటీవల బంగాళాఖాతంలోని వాయుగుండం కారణంగా రెండు మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిశాయి. ఇప్పుడు మళ్లీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
విపత్తుల నిర్వహణ సంస్థ సమాచారం ప్రకారం, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి గురువారానికి వాయుగుండంగా బలపడనుంది. శుక్రవారం ఉదయానికి ఇది దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీరాలను తాకే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వారం రోజులపాటు వర్షాలు కురుస్తాయని అంచనా. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఏలూరు, కృష్ణా జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
మరోవైపు తెలంగాణలోనూ మూడు నుంచి నాలుగు రోజుల వరకు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, గురువారం, శుక్రవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగ కానుక.. పెరుగనున్న డీఏ..
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!