Weather Alert : తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం, రాగల కొన్ని గంటల్లో రాష్ట్రంలోని దక్షిణ జిల్లాలైన మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మార్పుకు ప్రధాన కారణం క్యుములోనింబస్ మేఘాలు అని వాతావరణ నిపుణులు తెలిపారు.
ఈ రాత్రి హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. రేపు పగలు వేడి వాతావరణం ఉన్నప్పటికీ, సాయంత్రం వేళల్లో వాతావరణం చల్లబడి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఈ మేఘాల ప్రభావంతో వర్షాలు మొదలయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా బయటకు వెళ్లేవారు వాతావరణ మార్పులను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Mahavatar Narsimha : ఓటీటీలోకి మహావతార్ నరసింహా.. ఎక్కడ, ఎప్పటి నుంచి..?
హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. అసాధారణంగా తక్కువ సమయంలో కురుస్తున్న కుంభవృష్టి వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, వరద నీరు ఇళ్లలోకి చేరే అవకాశం ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అధికారులకు ఆదేశాలు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు జీహెచ్‌ఎంసీ, జలమండలి, పోలీస్, విద్యుత్ వంటి వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అవసరమైన చోట వెంటనే స్పందించాలని తెలిపారు. అలాగే, మ్యాన్‌హోల్స్ వద్ద జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.
Illegal Liquor: తెలివి మీరిన కేటుగాళ్లు.. భారీగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మకాలు బట్టబయలు!