Estimated flood damage in Telangana: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు గోదావరి పరివాహక ప్రాంతాలతో పాటు ఉత్తర తెలంగాణలోని చాలా ప్రాంతాలు తీవ్ర నష్టాలకు గురయ్యాయి. గోదావరి నది పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాల్లోని పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా నిర్మల్, బైంసా, మంచిర్యాల, మంథని, రామగుండం, భద్రాచలం పట్టణాల్లోని చాలా కాలనీలు నీట మునిగి భారీ నష్టం వాటిల్లింది. రోడ్లు, భవణాలు, విద్యుత్ స్థంబాలు నెలకొరిగాయి. తాజాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల…
తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. 2022-23 విద్యా సంవత్సరానికి గానూ కొత్తగా మరో 20 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు కేటాయించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశవ్యాప్తంగా 4,982 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల ఉంటే అందులో 696 అంటే సుమారుగా 15 శాతం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని కిషన్ రెడ్డి వెల్లడించారు.
Clash between TRS and BJP parties in Mancherial district: మంచిర్యాల జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు వర్గాలు పరస్పరం నినాదాలు చేసుకుంటూ బాహాబాహీకి దిగాయి. కర్రలు, చెప్పులతో రెండు పార్టీ కార్యకర్తలు కొట్టుకున్నారు. రెండు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. వరద బాధితులను ఆదుకోవాలని బీజేపీ నిరసన తెలియజేస్తుంటే.. జీఎస్టీ పెంపుపై టీఆర్ఎస్ పార్టీ నిరసనలు తెలిపాయి. మంచిర్యాల…
తెలంగాణ ప్రజలు కన్న కలలు సాకారం అయిన రోజు. 58 ఏళ్లపాటు వివక్షకు గురైన జనం సొంత రాష్ట్రం సాధించుకున్న అద్భుతమయిన రోజు. నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ఇవాళ్టితో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తయ్యాయి. తొమ్మిదవ ఏట అడుగుపెట్టాం. ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. నీళ్లు, నిధులు, నియమాకాల నినాదంతో దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.…
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో మాట్లాడారు. పలు అంశాలను కూలంకషంగా వివరించారు. కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయత వుంది. చెప్పిన మాటకు కట్టుబడి వుంటాం. రాష్ట్ర విభజనపై అవగాహన లేనివారు ఏదో ఒకటి మాట్లాడుతారు. 2009 నుంచి 2014 వరకూ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ లేదు. కాబట్టి రాష్ట్ర విభజన చేయలేదు. వంక పెట్టారని వచ్చే ఆరోపణల్ని ఖండిస్తున్నా. బిల్లు పెట్టి పాస్ కాకుంటే మొదటికే మోసం వస్తుందని,…
తెలంగాణపై మోడీ మాటలు మంటలు రాజేస్తున్నాయి. తెలంగాణకు తల్లి లాగా..సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చిందని, మోడీ..కాంగ్రెస్ పార్టీని దోషిగా చూపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. సీమాంధ్రకు కూడా ఆర్దికంగా ఆదుకోవడం కోసం పోలవరం..స్పెషల్ స్టేటస్ ఇచ్చింది కాంగ్రెస్. ఎనిమిదేళ్ళలో విభజన హామీలు అమలు చేయకుండా మోడీ ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నారన్నారు. తెలంగాణ అప్పుల ఊబిలోకి పోవడానికి మోడీ..కేసీఆర్ కారణం అన్నారు. తెలంగాణలో ఆశించిన ఉద్యోగాల కల్పన లో కేసీఆర్ వైఫల్యం చెందారన్నారు. ఐటీఐఆర్…
హుజూరాబాద్ ఉప ఎన్నికపై అధికార పార్టీ ఫోకస్ పెంచింది. టైమ్ దగ్గరవుతున్నందున అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి. టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు ఎవరో ఇప్పటికే తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది ఎవరన్నది కూడా దాదాపు ఫైనల్ అయింది. హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ కోసం రేవంత్ వెయిటింగ్. కాగా బరిలో తామూ ఉంటామని వైఎస్ షర్మిల ఇటీవలే ప్రకటించారు. దాంతో వైఎస్సార్‌టీపీ అభ్యర్థి కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో ఉంటారని తేలిపోయింది. ఇక బీఎస్పీ ఇప్పటి…
మరోసారి తెలంగాణను వ్యాక్సిన్ల కొరత వెంటాడుతోంది… హైదరాబాద్‌లో వ్యాక్సిన్ల కోసం ప్రజలు పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.. రెండో డోసు అయినా.. మొదటి డోసు అయినా ఏం తేడా లేదు.. తెల్లవారుజామునే వ్యాక్సిన్ కేంద్రాల దగ్గర క్యూలైన్లు కనిపిస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు… అయితే, ఒక్కో పీహెచ్‌సీలో 100 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేసుతున్నారు సిబ్బంది.. దీంతో.. మిగతావారు వెనుదిరిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితి.. గతంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రోజుకు లక్ష మందికి పైగా వ్యాక్సిన్…
ధాన్యం కొనుగోళ్లల్లో ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాది యాసంగి రికార్డును దాటాయి ధాన్యం కొనుగోళ్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తొలి ఏడాది 2014-15లో 13.24 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా… ఈఏడాది 10 లక్షల మంది రైతుల నుండి 12,247 కోట్ల విలువచేసే 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది ప్రభుత్వం. కానీ గత ఏడాది ఇదే సమయానికి 56.82 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు…