Telangana Formation Day: దేశానికి దిక్సూచి తెలంగాణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రజలు కన్న కలలు సాకారం అయిన రోజు. 58 ఏళ్లపాటు వివక్షకు గురైన జనం సొంత రాష్ట్రం సాధించుకున్న అద్భుతమయిన రోజు. నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ఇవాళ్టితో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తయ్యాయి. తొమ్మిదవ ఏట అడుగుపెట్టాం. ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. నీళ్లు, నిధులు, నియమాకాల నినాదంతో దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
గత ఏడేళ్లుగా ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తూ.. దేశానికే తలమానికంగా నిలిచింది. అభివృద్ధి పథంలో తెలంగాణ ముందుకెళుతోంది. ఉద్యమ నేత కేసీఆర్.. సీఎంగా రెండోసారి పదవీ చేపట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమయ్యారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఏప్రిల్ 27వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు. 2004లో టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పార్టీ పెత్తు పెట్టుకుంది. దీంతో తెలంగాణ జాతీయ ఎజెండాగా మారింది. ప్రత్యేక రాష్ట్రం కోసం 2009 నవంబర్ 29వ తేదీన కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రారంభించారు. కేసీఆర్ దీక్షకు యావత్ తెలంగాణ సమాజం మద్దతు పలికింది. నవంబర్ 29 వ తేదీ నుంచి ఉద్యమం తీవ్రస్థాయికి చేరింది. కేసీఆర్ నిమ్స్‌లో దీక్ష కొనసాగించడంతో… డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించారు. దీంతో కేసీఆర్ దీక్ష విరమించారు.
Also Read
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
- Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
- TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
- Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
తెలంగాణను సాధించిన నేత.. రాష్ట్రానికి సీఎం కావడంతో అన్నిరంగాల్లో తెలంగాణ దూసుకెళ్తున్నది. పాలకుల్లో సంకల్పం ఉంటే అద్భుతాలు ఎలా ఉంటాయో కాళేశ్వరం ప్రాజెక్టు పనులే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మ, గౌరవెల్లి, తపాస్‌పల్లి, తోటపల్లి, సింగూరు, హల్దీవాగులతో ఉమ్మడి మెదక్ సస్యశ్యామలంగా మారుతున్నది. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ముందు వరుసలో నిలిచింది. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్, నర్సింగ్ కాలేజీల కల కూడా నెరవేరనున్నది.
రైతులకు రాష్ట్ర సర్కార్ పెద్ద పీట వేసింది. రైతు బీమా, రైతు బంధుతో అన్నదాతలకు అండగా నిలిచింది. ఇక కేసీఆర్ కిట్లు, ఆసరా పెన్షన్లు, కంటి వెలుగు, షాదీ ముబారక్ వంటి పథకాలతో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోంది. ఐటీలోనూ మంచి ఫలితాలు రాబడుతూ దేశానికి దిక్సూచిలా మారింది. అటు.. పారిశ్రామిక అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పరిశ్రమలకు రాయితీలతో పాటు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇచ్చేందుకు టీఎస్ ఐపాస్ వంటి విప్లవాత్మక విధానాలకు శ్రీకారం చుట్టింది. ఫలితంగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు దోహదపడింది. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో సేఫ్ డెస్టినేషన్ హైదరాబాద్. ఎన్నో అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం.
telangana formation day: పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!