తెలంగాణలో మరో కొత్త మండలం ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. నిజామాబాద్ జిల్లాలో మండల కేంద్రంగా పోతంగల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేసన్ జారీ చేసింది.
మీ అందరికీ వినమ్రంగా చేతులు మోడ్చి నమస్కరిస్తూ నేను కోరుకునేది ఒక్కటే.. ఎన్నటికీ ఈ నేల శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలే తప్ప, అశాంతి, అలజడులతో అట్టుడికి పోవద్దని సీఎం కేసీఆర్ కోరుకున్నారు. తిరిగి తెలంగాణ మరో కల్లోలంలోకి జారిపోవద్దని అన్నారు. తెలంగాణ ఈనాడు ఎంత వేగంగా పురోగమిస్తున్నదో.. అంతేవేగంతో రాబోయే రోజుల్లోనూ అప్రతిహతంగా అభివృద్ధి పథంలో దూసుకు పోవాలని అన్నారు సీఎం. యావత్ తెలంగాణ ప్రజలకూ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హృదయపూర్వక…
Telangana Vimochana Dinotsavam: తెలంగాణ విమోచన దినోత్సవంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు సమాయత్తం అవుతోంది. సెప్టెంబర్ 17న జరిగే విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలనుకుంటోంది. కేంద్ర సాంస్కృతిక, కేంద్ర హోం శాఖ అధ్వర్యంలో పెరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవాలు జరగనున్నాయి. కేంద్ర హోం శాఖ పరిధిలో సాయుధ దళాలతో పెరేడ్ నిర్వహించనున్నారు.
NITI Aayog comments on cm kcr allegation: ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విమర్శలపై నీతి ఆయోగ్ స్పందించింది. కేసీఆర్ ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అజెండా తయారీలో రాష్ట్రాల సహకారం లేదని కేసీఆర్ చేసిన విమర్శల్లో నిజం లేదని తేల్చిచెప్పింది. రేపటి సమావేశానికి సన్నాహకంగా తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాల సీఎస్ లతో సంప్రదింపులు జరిగాయని తెలిపింది. రాష్ట్రాలతో సన్నిహితంగా పనిచేయడానికి ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామని.. గత ఏడాది సీఎంలతో 30కి పైగా…
Women: 'ఆమె'కు మరోసారి వందనం. ఎందుకంటే 'ఆమె' ఆకాశంలో సగమేనేమో గానీ అవయవదానంలో మాత్రం అంతకుమించి. తల్లిగా, సోదరిగా, ఇల్లాలిగా ప్రేమను పంచటంలో మాత్రమే కాదు. చివరికి తన శరీర భాగాలను పంచటంలో సైతం 'ఆమె' తనకుతానే సాటి అని నిరూపించుకుంది.
Telangana: ప్రజల కోసం ఇప్పటికే ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న తెలంగాణ రాష్ట్ర (సమితి) ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. ఆ పథకానికి ఇంకా పేరు పెట్టలేదు. బహుశా "కార్మికబంధు" అనే పేరు పెట్టొచ్చని భావిస్తున్నారు.