Weather: తెలంగాణలో గత రెండు రోజులుగా పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇదే పరిస్థితి మరో నాలుగు రోజులు కూడా కొనసాగే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్రవ్యాప్తంగా వర్ష సూచనను జారీ చేసింది.
Rain in Warangal: చిన్నగా ప్రారంభమైన గాలి దుమారం క్రమంగా బీభత్సాన్నే సృష్టించింది. వరంగల్ జిల్లాలోని వరంగల్ తూర్పు, నర్సంపేట నియోజకవర్గాల్లో శనివారం రాత్రి అకాల వర్షం, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి.
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు దంచి కొడుతున్నాయి. వడగళ్లు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అన్నదాతను ఆగమాగం చేశాయి. ఎండాకాలంలో అకాల వర్షాలతో పంటలు భారీగా దెబ్బతిన్నడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. నష్టపోయిన పంటను చూసి కన్నీరు పెడుతున్నారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
Rains: తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఒకవైపు సూర్యకాంతి. మరోవైపు అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కురియడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
Heat Waves: తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఎండలు బండులు పగిలే మండుతున్న సమయంలో వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.