Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూలో నిల్చున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా 36.68 శాతం పోలింగ్ నమోదైంది.
Read Also: Telangana Elections 2023: పోలింగ్ బూత్ ముందు తగలబడిన చెట్టు..ఆందోళనలో ఓటర్లు!
ఇదిలా ఉండగా.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత భర్త మహేందర్ రెడ్డి పోలింగ్ బూత్‌లోకి వెళ్లేందుకు యత్నం చేశారు. మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. మహేందర్ రెడ్డి కారుపై రాళ్ళ దాడి జరిగింది. పాక్షికంగా కారు ధ్వంసం కాగా.. కాంగ్రెస్ కార్యకర్తలే దాడి చేశారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.