Jagadish Reddy : అసెంబ్లీ సస్పెన్షన్ పై సంచలన వ్యాఖ్యలు
- నేను ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదు
- సభ వాయిదా సమయంలో కేసీఆర్ ఫోన్ చేశారు
- ఎథిక్స్ లేని ప్రభుత్వానికి ఎథిక్స్ కమిటీ ఎలా ఉంటుంది? : జగదీష్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagadish Reddy : తెలంగాణ శాసనసభ సమావేశాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో BRS ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్‌పై స్పందించారు. తనపై నిషేధాన్ని అన్యాయంగా అమలు చేశారనే ఆరోపణలు చేస్తూ, అసెంబ్లీ లోపల తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. NTV తో మాట్లాడుతూ జగదీష్ రెడ్డి తనపై తప్పుడు నిర్ధారణలతో మోపారని ఆరోపించారు. “నేను స్పీకర్ పై ఎలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయలేదు. ప్రభుత్వం చేసే తప్పులను బయటపెడుతున్నానని నన్ను లక్ష్యంగా చేసుకున్నారు,” అని ఆయన ఆరోపించారు.
జగదీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ, “సభ 15 నిమిషాలు వాయిదా పడిన సమయంలో కేసీఆర్ మాకు ఫోన్ చేసి, తప్పుడు ఆరోపణలు ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండమని, స్పీకర్‌ను విచారణకు కోరమని సూచించారు” అని తెలిపారు. తమ వ్యాఖ్యలు నిరూపించడానికి వీడియోలు చూపించడానికి కూడా సిద్ధమని చెప్పారు.
Also Read
- CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
- Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
- CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
- Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
అసెంబ్లీలో తాను అన్యాయంగా సస్పెండ్ అయ్యానని మండిపడిన జగదీష్ రెడ్డి, “మూడ్ ఆఫ్ ది హౌస్” పేరిట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శించారు. “ఈ ప్రభుత్వం ఎథిక్స్ లేని ప్రభుత్వం. అలాంటప్పుడు ఎథిక్స్ కమిటీ ఉండటానికి ఎలా అవకాశం ఉంటుంది?” అని ప్రశ్నించారు.
అసెంబ్లీలో తన గళాన్ని నొక్కినా, బయట తన గొంతును అణచలేరని ఘాటుగా స్పందించారు. “నేను తప్పు చేసి ఉంటే నా సభ్యత్వాన్ని రద్దు చేసేవారు. కానీ, నన్ను కావాలని సస్పెండ్ చేశారు. కేసీఆర్ చెప్పినట్లు రేపటి నుంచి నా కార్యాచరణ కొనసాగుతుందని తెలిపారు.
Ola S1 E-Scooters: హోలీ వేళ ఓలా స్కూటర్లపై భారీ డిస్కౌంట్.. రూ.25 వేలకు పైగా
తాజావార్తలు
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!