Kunamneni Sambasiva Rao : జగదీష్ రెడ్డి సస్పెన్షన్‌పై కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు
- ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్‌పై కూనంనేని సాంబశివరావు స్పందన
- అసెంబ్లీ లో స్పీకర్ చైర్‌కు గౌరవం ఇవ్వడం సభ్యులందరి బాధ్యత
- సభ్యులు సభలో సంయమనంతో, ఆచితూచి మాట్లాడాలి : కూనంనేని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kunamneni Sambasiva Rao : బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్‌పై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ అసెంబ్లీ లో స్పీకర్ చైర్‌కు గౌరవం ఇవ్వడం సభ్యులందరి బాధ్యత అని అన్నారు. సభ్యులు సభలో సంయమనంతో, ఆచితూచి మాట్లాడాలని సూచించారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ నిర్ణయాన్ని పునరాలోచించాలని ప్రభుత్వానికి కూనంనేని సూచించారు. ఈ సందర్భంగా, సోషల్ మీడియాలో పోస్టులపై చర్యలు తీసుకోవడం అవసరమని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నేతలపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వారిపై గతంలో చర్యలు తీసుకున్న ఉదాహరణలను ప్రస్తావిస్తూ, తెలంగాణలోనూ అదే విధంగా నియంత్రణ అవసరమని అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి శాసనసభ నుంచి సస్పెండ్ అయ్యారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు ఆయన సస్పెన్షన్ కొనసాగుతుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ (Speaker Gaddam Prasad) ఉత్తర్వులు జారీ చేశారు. సభలో మాట్లాడుతూ, “మీరు మేము ఎన్నకుంటేనే స్పీకర్ అయ్యారు. సభ మీ ఒక్కరిదీ కాదు, అందరదీ” అని జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యుల డిమాండ్ చేసినా ఆయన క్షమాపణ చెప్పకపోవడంతో స్పీకర్ ఆయనను సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Also Read
- Wife Kills Husband: ప్రియుడితో కలిస భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
CP CV Anand: 35 ఏళ్ల తర్వాత ఒకేరోజు హోలీ, రంజాన్ రెండో శుక్రవారం.. సీవీ కీలక సూచనలు…
తాజావార్తలు
-
Wife Kills Husband: ప్రియుడితో కలిస భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!