తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థగా యూపీఎఫ్ నిలిచింది. యూపీఎఫ్ నూతన కార్యవర్గంఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. కన్వీనర్ గా బొల్లా శివశంకర్, అడ్వైజర్ గా గట్టు రామచందర్ రావును నియమించారు. అనంతరం తెలంగాణ జాగృతి కార్యాలయంలో యూపీఎఫ్ నాయకులతో కవిత సమావేశం నిర్వహించారు. త్వరలోనే బీసీ బిల్లులు సాకారం అయ్యేందుకు కార్యచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు.
REA MORE: Sharmistha Panoli Arrest: పవన్ కళ్యాణ్ తర్వాత, కంగనా రనౌత్.. శర్మిష్ట పనోలి అరెస్ట్‌పై ఆగ్రహం..
కాగా.. తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత వ్యవహారం సంచలనంగా మారింది. కవిత.. కేసీఆర్‌కు రాసిన లేఖతో వివాదం మొదలు కాగా.. తాజాగా చిట్ చాట్‌లో చేసిన వ్యాఖ్యలతో మరింత ముదిరింది. కవిత వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయాల్లో వాడీవేడీ చర్చ జరుగుతుంది. ఆమె పార్టీ మారుతుందంటూ జోరుగా ప్రచారం సాగుతున్న వేళ.. కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ కవిత.. నిన్న (శనివారం) కొత్త ఆఫీస్ ప్రారంభించారు. జాగృతి కార్యకలాపాలు నిర్వహించేందుకు గాను ఈ ఆఫీసును వినియోగించనున్నారు. ఆమె తన నివాసం పక్కనే కొత్త జాగృతి కార్యాలయాన్ని.. ఏర్పాటు చేశారు. అద్దె భవనంలో ఈ ఆఫీస్ ప్రారంభించారు.
REA MORE: Karnataka: 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. వీడియోలతో బ్లాక్‌మెయిల్..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్, ఆచార్య జయశంకర్ స్ఫూర్తితో జాగృతి సంస్థ ఏర్పడింది. ఈ సంస్థను ప్రారంభించి 18ఏళ్లు అయింది. ఇప్పటి వరకు అశోక్‌నగర్‌లో జాగృతి కార్యాలయం ఉండేది.. ఇప్పుడు బంజారాహిల్స్‌కు మార్చాం. ఇకపై ఇక్కడి నుంచే సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తాం. ఇన్నేళ్ల ప్రయాణంలో ఎందరో ఆశీస్సులు అందించారు. మేము చేసిన ఉద్యమాల వల్ల చాలా జీవోలు వచ్చాయి. గత పదేళ్ల కేసీఆర్ పాలనకు.. ఇప్పటి కాంగ్రెస్ పాలనకు ఎంతో తేడా ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా ‘జై తెలంగాణ’ అనాలి. అమరవీరులకు నివాళులు అర్పించాలి. కనీసం రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజైనా రేవంత్‌రెడ్డి.. ‘జై తెలంగాణ’ అనాలి.