TPCC Mahesh Goud : మాజీ మంత్రి హరీష్ రావును టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని హరీష్ రావును ఉద్దేశించి స్పష్టం చేశారు. “బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించలేదు అనే మాట నిజమా?” అని ప్రశ్నించిన మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ ఆస్తులు విలువ తగ్గించిన విధానాన్ని “కంచె చేను మేసినట్లు” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
YS Jagan: బాబుగారూ.. సీఎంగా దశాబ్ధాల అనుభవం ఏం నేర్పింది..?
అలాగే, హరీష్ రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ భేటీ అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేస్తూ, “ఈ సమావేశంపై మా వద్ద స్పష్టమైన సమాచారం ఉంది,” అని పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొత్తు ఉందన్న అభియోగాలపై స్పష్టత కోరుతూ, ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు ముందు హరీష్ రావు సమాధానం చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై గౌడ్ ఘాటు విమర్శలు చేశారు. “రూ. 1.20 లక్షల కోట్లను ఖర్చు పెట్టిన కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరానికి అయినా నీరు వచ్చిందా?” అని ప్రశ్నిస్తూ, “కాళేశ్వరం కూళేశ్వరం అయింది” అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాక, హరీష్ రావు రాజకీయ భవిష్యత్తుపై సెటైర్లు వేస్తూ – “నాలుగు ముక్కలాటలో ఏ పార్టీ తరఫున పోటీ చేస్తావ్ హరీశ్ రావూ?” అని క్విప్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీల మధ్య నడుస్తున్న రాజకీయ నాటకాలను ప్రజలకు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
Karumuri Nageswara Rao: ప్రజలు ప్రశాంతంగా ఉండటం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదు..