తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించారు. తమకు ఓట్లు వేసి గెలిపించిన జనాల పైనే రేవంత్ రెడ్డి తన ప్రతాపం చూపిస్తున్నారని.. హైడ్రా తో ఇళ్లను కూలగొట్టడం, రైతుల ధాన్యం కొనక పోవడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కూడా రెండు కళ్ళ సిద్ధాంతం తో పని చేస్తున్నారని..
ఒక కన్ను రాహుల్ గాంధీ అయితే మరోకన్ను నరేంద్ర మోడీ అని ఆరోపించారు.
READ MORE: Sharmistha Panoli Arrest: పవన్ కళ్యాణ్ తర్వాత, కంగనా రనౌత్.. శర్మిష్ట పనోలి అరెస్ట్‌పై ఆగ్రహం..
అందుకే రేవంత్ రెడ్డి ఎన్ని తప్పులు చేసినా ఇద్దరూ వెనుకేసుకొస్తున్నారని ఎమ్మె్ల్సీ దాసోజు శ్రవణ్ చెప్పారు. రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చొని ఆ కుర్చీని, కాంగ్రెస్ పార్టీ క్రెడిబుల్టీని విధ్వంసం చేశారన్నారు. అమ్మడం, కొనడం సీమాంధ్ర నాయకుల దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేర్చుకున్నారని.. ఏఐసీసీ సైతం హస్త గతం చేసుకున్నారని విమర్శించారు.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నక్కల పాలైనట్టుగా రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పెద్దల దుర్మార్గానికి విధ్వంసం గురవుతుందన్నారు. ఐదుసార్లు అందగత్తెలను చూడటానికి టైం స్పెండ్ చేశారని ఆరోపించారు. రైతుల కళ్ళలో కన్నీళ్లు వస్తున్నాయని.. ఒక్క దాన్యం కేంద్రాన్ని కూడా పరామర్శించలేదని ఎద్దేవా చేశారు. అందాల పోటీలలో జరిగిన ఎంక్వయిరీ రిపోర్ట్ బహిర్గతం చేయాలని.. దొంగలెవరో, దొరలు ఎవరో బయటపడుతుందన్నారు.
READ MORE: Karnataka: 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. వీడియోలతో బ్లాక్‌మెయిల్..