1.గుంటూరు జిల్లాలోని దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహం విధ్వంసంపై డీజీపీకి సోమవారం చంద్రబాబు లేఖ రాశారు. ఇలాంటి చర్యలు పునారావృతం కాకుండా చూడాలని ఆయన లేఖలో పేర్కన్నారు. నిన్న దుర్గిలో వైసీపీ జెడ్పీటీసీ సభ్యుడు శెట్టిపల్లి యలమంద కుమారుడు శెట్టిపల్లి కోటేశ్వర్ రావ్ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేశారన్నారు. విగ్రహ విధ్వంసం వివిధ వర్గాల ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే పెద్ద కుట్రలోభాగంగానే చేశారన్నారు. 2.నిన్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఉద్యోగుల బదిలీల…
1.ఏపీలో ఒక సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రులు, మంత్రుల కాళ్లు మొక్కడం అలవాటయిపోయింది. ఆ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లను సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు మొక్కి వార్తల్లో నిలిచారు. తాజాగా విజయనగరం జాయింట్ కలెక్టర్ సిహెచ్ కిషోర్ కుమార్ మంత్రి బొత్స సత్యనారాయణ కాళ్లు మొక్కి వార్తల్లో నిలిచారు. జనవరి 1న న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికి మంత్రి బొత్స సత్యనారాయణను కలిశారు. మంత్రికి బొకే ఇచ్చిన ఆయన.. వంగి…
1. దేశంలో జీఎస్టీ వసూళ్లు వరుసగా ఆరో నెల కూడా లక్ష కోట్లు దాటాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో రూ.1,29,780 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా (సీజీఎస్టీ) రూ.22,578 కోట్లు కాగా… రాష్ట్రాల వాటా (ఎస్జీఎస్టీ) రూ.28,658 కోట్లు, అంతర్జాతీయ వాటా (ఐజీఎస్టీ) రూ.69,155 కోట్లుగా నమోదయ్యాయి. 2.రాష్ట్ర ప్రజలు కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.…
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర, అమిత్ షా సభలు ఇప్పట్లో లేనట్టేనా? మంచి దూకుడు మీదున్న బీజేపీ స్పీడ్ కు ఆటంకాలు వచ్చాయా? ఒమిక్రాన్ ఎఫెక్ట్ కారణంగానే బీజేపీ యాత్రలు వాయిదా పడ్డాయా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. డిసెంబర్ 15 తరవాత ప్రజా సంగ్రామ యాత్ర ఉంటుందని గతంలో ప్రకటించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. అయితే, ఇప్పటి వరకూ యాత్ర షెడ్యూల్ ఖరారు కాలేదు. ఒకవైపు ఒమిక్రాన్ కేసులు..…
తెలంగాణలో ధాన్యం సేకరణపై కేంద్రం వర్సెస్ రాష్ట్రంగా వివాదం చెలరేగింది. తాజాగా కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది. అయితే సీఎం కేసీఆర్, మంత్రుల బృందం వత్తిడి వల్లే కేంద్రం దిగివచ్చిందా? రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించిందంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ డిమాండ్కు కేంద్రం దిగొచ్చింది. సీఎం కేసీఆర్ కృషి, మంత్రుల దౌత్యం ఫలించింది. వానా కాలం పంటకు సంబంధించి రాష్ట్రం నుంచి అదనంగా బియ్యం సేకరించేందుకు కేంద్రం అంగీకరించింది. రాష్ట్రం నుంచి మరో…
అధికారపార్టీలో చేరాక.. నిన్న మొన్నటి వరకు కామ్గా ఉన్న ఆ ఎమ్మెల్యే ఒక్కసారిగా గేర్ మార్చారా? మంత్రిపైనే పైచెయ్యి సాధించారా? కీలక పదవిని తన నియోజకవర్గానికి దక్కించుకుని చర్చల్లోకి వచ్చారా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా పదవి? ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్లో.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల క్రాస్ ఓటింగ్ వేడి సెగలు రేపుతున్న సమయంలో.. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పదవి నియామకం మరో కొత్త చర్చకు దారితీసింది. పార్టీ నేత కొత్తూరు ఉమా మహేశ్వరరావుకు…
కేసీఆర్ విధానాలతో ప్రొఫెసర్ జయశంకర్ ఆత్మ ఘోషిస్తుందని బండి సంజయ్ అన్నారు. సోమవారం నిర్వహించిన ‘నిరుద్యోగ దీక్ష’ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ దీక్షను భగ్నం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలను గృహ నిర్భందం చేశారు. బీజేపీ దీక్ష అంటేనే కేసీఆర్కు వణుకుపుట్టిందన్నారు. ఇన్ని రోజులు సీఎంకు కోవిడ్ గుర్తుకు రాలేదు. ఈరోజు దీక్షకు వేలాది తరలివస్తున్నారని తెలిశాక కోవిడ్ గుర్తుకొచ్చిందా అంటూ…
తెలంగాణలో యూట్యూబ్ ఛానెళ్ళు లెక్కకు మిక్కిలిగా పెరిగిపోయాయి. వాటిపై నియంత్రణ కూడా వుండడం లేదు. దీంతో యూట్యూబ్ వార్తా చానెళ్లకు ముకుతాడు వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగిస్తోంది. యూట్యూబ్ చానెళ్లు చేస్తున్న అభ్యంతరకర ప్రసారాలపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అసత్య, విద్వేషపూరిత వార్తలు ప్రసారాలు చేయడం, మతాలు, కులాల మనోభావాలను దెబ్బతీయడం వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం వుంది. రాజకీయంగా కొందరిని టార్గెట్ చేసుకుని కామెంట్లు, పోల్స్ పెట్టి వ్యక్తిగత, కుటుంబ…
1. కృష్ణా జిల్లా గుడివాడలో ఇంట్రెస్టింగ్ సీన్ చోటుచేసుకుంది. మంత్రి కొడాలి నాని, టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, టీడీపీ నేత వంగవీటి రాధాలు ఒకేచోట కలుసుకున్నారు. గుడివాడలోని కొండాలమ్మ గుడి వీరి కలయికకు కారణమైంది. ఈ ముగ్గురూ కృష్ణా జిల్లాలో పేరున్న పొలిటికల్ లీడర్స్ కావడం విశేషం. 2. రైతు చట్టాలను మళ్లీ తీసుకు వస్తామని కేంద్ర మంత్రి నరేంద్ర తోమర్ నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆయన చేసిన వ్యాఖ్యలపై…
1.దేశంలో రోజు రోజుకు పెరిగిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. భారత్లో ఇప్పటికే 245 కేసులకుపైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొత్తం పదిహేడు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే వీటి తీవ్రత మాత్రం పది రాష్ట్రాల్లోనే ఉండటంతో రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక బృందాలను పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా రాష్ట్రాల్లో ఈ బృందాలు పర్యటించి కేసులను అధ్యయనం చేస్తారు. 2. ఏపీ పర్యటనలో ఉన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను ఏపీ సీఎం…