Ponguleti Srinivas Reddy : ఓపిక పట్టండి సీరియల్‌గా ఒక్కొట్టి బయటకు వస్తుందని వికారాబాద్ ఘటన పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతన్నలు ధర్నాలు చేసియాల్సిన అవసరం లేదని, Msp రేటు కంటే అదనంగా గింజ లేకుండా ప్రభుత్వం కొంటుందని ఆయన వెల్లడించారు. పచ్చరంగు వేసుకొని మీ దగ్గరకు వస్తున్నారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు. మొదటి దఫా పార్టీలకు అతీతంగా కడు బీదవారికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుందని ఆయన వెల్లడించారు. గాంధీ భవన్ లో ఎక్కువగా గత ప్రభుత్వం డబుల్ బెడ్ ఇండ్లు ఇస్తానని మోసం చేసిన అప్లికేషన్లు ఎక్కువగా వచ్చాయని, అందరికి ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు మంత్రి పొంగులేటి. కేవలం 27 రోజుల్లో రూ. 18 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేశామన్నారు, ఇంకా రూ. 13 వేల కోట్ల రుణాలు మాఫీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో ఎలాంటి ఆటలు లేదా తొండిపనులు చేయం అని స్పష్టం చేశారు. ఈ డిసెంబర్‌లో అర్హత కలిగిన రైతులకు రూ. 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. రైతుభరోసా కూడా త్వరలో అందించనున్నట్లు పేర్కొన్నారు.
Kakani Govardhan Reddy: సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తటస్థగా ఉందన్న విషయాన్ని అంగీకరించారు, కానీ ఇందులో ఎలాంటి దాపరికం లేదని చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్ని అవాస్తవాలు చెప్పినప్పటికీ, ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతామని ధీమా వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణ అంశంలో, ఈ రోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశమై చర్చలు జరిపినట్లు తెలిపారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని, ప్రతిపక్షాలు ధర్నాలు, నిరాహార దీక్షలు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. అలాగే, సన్న ధాన్యానికి రూ. 500 బోనస్ ఇచ్చే విధానంపై కూడా వివరించారు. అధికారంలో ఉండగా రైతులను జైల్లో పెట్టిన బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే పచ్చ కండువాలతో రైతుల దగ్గరికి వస్తున్నారని ఎద్దేవా చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
Marco rubio: పాకిస్తాన్ కష్టం.. ఇండియాకి ఇష్టం.. ట్రంప్ కీలక ఎంపిక..