TS BJP Leaders Nominations: తెలంగాణ రాష్ట్రంలో నేటితో నామినేషన్ల పర్వం ముగియనుంది. ఈ నేపథ్యంలో నేడు బీజేపీ నుంచి నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
కేసీఆర్ సిరిసిల్లలో వడ్ల బోనస్ గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి డ్రాయర్ ఊడదీస్తా అంటున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు సీఎంవా చెడ్డి గ్యాంగ్ లీడర్వా రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాలకు కేరాఫ్ అడ్రస్ అని, ఆ పార్టీది ‘ఆపన్న హస్తం కాదని, భస్మాసుర హస్తమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ‘పాంచ్ న్యాయ్’ పేరుతో మళ్లీ కొత్త హామీలతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమైందన్నారు. తెలంగాణను 10 ఏళ్లపాటు పాలించిన కేసీఆర్ రాష్ట్రంలో రైతుల దుస్థితికి ప్రధాన కారణమన్నారు.
BRS KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రూ.2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపాడు అంటూ వ్యాఖ్యలుపై కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాస్ రావు కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు.
ఆ మాజీ ఎమ్మెల్యే రెండు ప్రధాన పార్టీలతో దోబూచులాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే... కండిషన్స్తో టెన్షన్ పెడుతున్నారు. ఉన్న పార్టీ మీద అలిగారు.... రమ్మన్న పార్టీకి కండిషన్స్ అప్లై అంటున్నారు. ఆ ఎపిసోడ్కి ఎండ్ కార్డ్ ఎలా పడుతుందా అని రెండు పార్టీల కేడర్ ఆసక్తిగా చూస్తోంది. ఇంతకీ ఎవరా నాయకుడు? ఆయనకే ఎందుకంత డిమాండ్?
PM Modi: మాకు అధికారం కంటే ప్రజా సంక్షేమం ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జగిత్యాలలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు.
ఒక్క పన్ను పాడైతే అన్ని పీకేసుకుంటామా, ఎన్నికల్లో ప్రజలు అత్యాశకు పోయారని, ముఖ్యమంత్రి భాషపైన నిన్నటి కరీంనగర్ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.