Pocso Case : హైదరాబాద్ లో దారుణం జరిగింది. బోయిన్ పల్లిలో డ్యాన్స్ మాస్టర్ జ్ఞానేశ్వర్ సుబ్బు డ్యాన్స్ స్టూడియో నిర్వహిస్తున్నాడు. గత రెండు నెలలుగా అతని వద్ద డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చిన నాలుగేళ్ల చిన్నారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఎవరూ లేని టైమ్ లో ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. డ్యాన్స్ నేర్చుకునేందుకు వచ్చిన అమ్మాయిపై ఇలా ప్రవర్తించడంతో ఆమె చాలా భయపడిపోయింది. కొన్ని రోజులుగా డ్యాన్స్ స్కూల్ కు వెళ్లను అంటూ మారాం చేసింది. దీంతో ఏమైందని పేరెంట్స్ గట్టిగా ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది.
Read Also : Peddi : పెద్ది మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసిందోచ్..
ఆమె పేరెంట్స్ వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఇప్పటికే జ్ఞానేశ్వర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ విషయాన్ని ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. జ్ఞానేశ్వర్‌ను రిమాండ్‌కు తరలించామని.. స్టూడియోను సీజ్ చేసినట్టు వివరించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. చిన్న పిల్లలకు చెడు, మంచి స్పర్శలపై అవగాహన కల్పించాలంటూ సూచించారు. ఈ ఘటనతో మరోసారి లైంగిక వేధింపుల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
Read Also : Bandla Ganesh : నన్ను ఇబ్బంది పెట్టొద్దు.. బండ్ల గణేష్ షాకింగ్ పోస్ట్