Stephen Raveendra: ల్యాండ్ మాఫియాపై నజర్.. ఇకపై సాగనివ్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ల్యాండ్ మాపియాకు పోలీసులు చెక్ పెట్టనున్నారు. భూ కబ్జాలు, ఫోర్జరీ పత్రాలు సృష్టించి అమాయకులను సతాయించే ల్యాండ్ మాఫియాలకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేక దృష్టి సారించారు. వారి వ్యవహారాలకు చెక్ పెట్టేందుకు సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగంను పటిష్టం చేశారు. ఈ నేపథ్యంలో సీపీ ఈవోడబ్ల్యూ విభాగానికి కొంతమంది నిపుణులను జోడించారు. దర్యాప్తు అధికారులతో పాటు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ చట్టాలపై పూర్తి అవగాహన ఉన్న వారిని ఎంపిక చేసుకుని ల్యాండ్ మాఫియా చేసే కార్యకలాపాలను అణచివేసేందుకు కార్యాచరణను రూపొందించారు. బాధితులకు న్యాయం చేసేందుకు ఈ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం అధికారులు సమర్థవంతంగా పని చేసే విధంగా నైపుణ్యాన్ని పెంచుతున్నారు.
ఫోర్జరీ పత్రాల సృష్టితో పాటు తప్పుడు పత్రాలతో అమాయకులను బెదిరించి వారి స్థలాలలో భవనాలు నిర్మించి వారిపై చట్టపరంగా కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ తప్పుడు పనులకు సంబంధం ఉన్న ప్రతి ఒకరికీ చట్టపరంగా శిక్షలు పడేలా ఓ ప్రక్రియను రూపొందించారు. దీంట్లో భాగంగానే ఇప్పుడు సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాలతో పాటు ల్యాండ్ మాఫియా ఆగడాలపై వస్తున్న ఫిర్యాదులను సైతం సమర్థవంతంగా దర్యాప్తు చేపట్టింది.
Also Read
ఈవోడబ్ల్యూ అధికారులు చేసే పకడ్బంది దర్యాప్తు బాధితుడికి ఊరటను ఇవ్వడంతో పాటు అతడికి ప్రాథమికంగా చట్టపరమైన చిక్కులను తొలగించే అవకాశం కూడా ఉంది. కొన్ని నెలల కిందట ఈవోడబ్ల్యూ అధికారులు రామచంద్రాపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఓ కేసు దర్యాప్తు చేశారు. కొందరు నకిలీ పత్రాలతో వెయ్యి గజాల స్థలాన్ని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. బాధితుడు ఫిర్యాదుతో ఈవోడబ్ల్యూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంలో మొత్తం 12 మందిని అరెస్టు చేశారు. బాధితుడికి తిరిగి స్థలం దక్కడంతో సంతోషం వ్యక్తంచేసారు. సైబరాబాద్ పోలీసులపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
తాజావార్తలు
-
Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
-
Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
-
Raghava Lawrence: సూర్య, విక్రమ్లకే సాధ్యం కాని సాహసం.. లారెన్స్ చేతులెత్తేస్తాడా? లేక చరిత్ర తిరగరాస్తాడా?
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో షీ టీమ్స్ ఫుల్ ఫోకస్.. 1,100 కేసులు.!
-
Rahul Gandhi: ఇందిరా ఓడిపోయింది, బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదు.
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!