ఇటీవలే యూట్యూబర్ శ్రీకాంత్ పై కరాటే కళ్యాణి దాడి చేసిన విషయం తెలిసిందే.. దీంతో ఆవీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ కావడంతో.. ఓరేంజ్ లో చర్చకు దారితీసింది. కరాటే కళ్యాణి శ్రీకాంత్ పై శ్రీకాంత్ కరాటే కళ్యాణిపై ఒకరి పై మరొకరు పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టారు అధికారులు. కరాటే కళ్యాణి దగ్గర వున్న దత్తత తీసుకున్న పాపపై కేసు మలుపుతిరిగింది. ఎలా దత్తత తీసుకున్నారు అంటూ ఇంటి వరకు విచారణకు వెళ్లారు అధికారులు.
అక్కడ కరాటే కళ్యాణి లేకపోవడంతో.. విచారణ మరింత బలంగా మారింది. ఎట్టకేలకు మీడియా ముందు ప్రత్యక్షమైన కరాటే కళ్యాణి నేను పారిపోలేదంటూ .. తన గురించి చెప్పుకొచ్చారు. అంతటితో కథ సుఖాంతమైందనుకుంటే.. మరోమారు వార్తల్లోకి ఎక్కారు కరాటే కళ్యాణి.. అసభ్యకర ఫ్రాంక్ వీడియోలు చేస్తున్న యూట్యూబర్స్ పై సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఇరవై యూట్యూబ్ ఛానెళ్లపై కరాటే కళ్యాణి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
సాక్ష్యాలతో సహా సీసీఎస్ పోలీసులకు కళ్యాణి ఫిర్యాదు చేయడం గమనార్హం. దీంతో కరాటే కళ్యాణి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సీసీఎస్ పోలీసులు. ఐటీ యాక్ట్ లోని 67A, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, యూట్యూబ్ చానెళ్లకు త్వరలో నోటీసులు పంపుతామని తెలిపారు. ఇప్పటికే ఆయా యూట్యూబ్ ఛానెళ్లపై నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కేసు విచారణకు ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.
Ntvతో.. కరాటే కళ్యాణి
కరాటే కళ్యాణి Ntvతో మాట్లాడారు. యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్న అశ్లీల,అసభ్యకర వీడియో లపై సిసిఎస్ లో కంప్లైంట్ చేశానని అన్నారు. ఐటి యాక్ట్ తోపాటు ఐపిసి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. నేను ఏ ఒక్కరు మీద పోరాటం చెయ్యట్లేదని, అసభ్యకర వీడియోలతో యువత పెడదారి పడుతున్నారని కరాటే కళ్యాణి తెలిపారు. ఇంట్లో నుండి బయటికి వెళ్ళాక తమ పిల్లలు ఏం చేస్తున్నారో తెలియడం లేదని పేరెంట్స్ ఆందోళనలో ఉన్నారని అన్నారు. అందుకోసమే ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశానని కళ్యాణి అన్నారు.
ఇలాంటి వీడియోలు అప్ లోడ్ చేసే వారి రెవెన్యు కట్ చేస్తే ఇంకెవ్వరూ అప్లోడ్ చేయరని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాను సినిమాలో నటించిన సన్నివేశాలు పై అభ్యంతరం చెబుతున్నారు కొంతమంది అని పేర్కొన్నారు. అవి క్యారెక్టర్ పరంగా చేసిన పాత్రలు మాత్రమేనని, సినిమాకు సెన్సార్ బోర్డు ఉంది, అశ్లీలం ఉంటే వాళ్ళే కట్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ.. ఇలా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసే వారి వీడియోలను ఎవరు నియంత్రించలేరని మండిపడ్డారు. అందుకే ఇలాంటి వాటిని తొలగించేంత వరకు నా పోరాటం కొనసాగుతుందని కరాటే కళ్యాణి చెప్పుకొచ్చారు.
YCP : ఆయన లేనిదే అడుగు కూడా వేసేవారు కాదట..! ఇంతకీ ఎవరాయన..?