ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు. కానీ అలాంటి ఇంటి దొంగను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. సొంత అన్న ఇంటిలోనే చోరీ చేసిన చెల్లెల్ని, ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని కటకటాల్లోకి నెట్టారు. హైదరాబాద్ గాజులరామారంలోని షిరిడీ హిల్స్‌లో కొంత కాలంగా వేముల శ్రీకాంత్ అనే వ్యక్తి భార్యా, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. అతని తల్లిదండ్రులు కర్మన్‌ఘాట్‌లో నివాసం ఉంటున్నారు. కొత్త కారు పూజ కోసం శ్రీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి కర్మన్‌ఘాట్‌కు వెళ్లారు.…
డబ్బు కోసం మనిషి ఏదైనా చేస్తాడు అని చెప్పడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ. తనకి వ్యాపారంలో నష్టం వచ్చిందని ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు అత్తని హత్య చేయాలని ప్లాన్ చేశాడో కసాయి అల్లుడు. ఇన్సూరెన్స్ పాలసీలు కట్టించి, ఉన్న భూమి అత్త పేరుపై రాసి కొడుకు లెవెల్‌లో బిల్డప్ ఇచ్చి చివరికి కాల యముడిలా మారాడు. సిద్ధిపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. బీమా డబ్బుల కోసం సొంత అత్తకే స్పాట్ పెట్టాడు.…
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఓ ఓయో హోటల్లో బ్యూటిషన్ అనూష అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఆత్మహత్యగా భావించిన హోటల్ సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అనూష తల్లిదండ్రులు... ఆత్మహత్య కాదని.. ఆమెకు అలాంటి ఆలోచనలు లేవని.. కచ్చితంగా ఏదో జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. దాంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.