Jangaon RTC Bus Accident: జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ప్రభుత్వం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాయి వైద్య బృందాలు. హనుమకొండ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం చోటుచేసుకున్న…
Nizamabad: నిజమాబాద్‌లోని నవీపేట మండలం ఫకీరాబాద్ మిట్టాపూర్ శివారులో మొండెం లేని మహిళ మృతదేహం కలకలం సృష్టించింది. బాసర ప్రధాన రహదారి సమీపంలలో నగ్నంగా మహిళ మృతదేహం లభ్యమైంది. ఓ చేయి, మరో చేతి వేళ్ళు, తల తొలగించి అతి కిరాతకంగా హత్య చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, డాగ్ స్కాడ్ తో తనిఖీలు నిర్వహించారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీపీ సాయి చైతన్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇది…
Wanaparthy: వనపర్తి జిల్లా కేంద్రంలో దారుణ హత్య కేసు వెలుగుచూసింది. వివాహేతర సంబంధం కారణంగా భార్యే భర్త ప్రాణాలు తీసింది. జిల్లా కేంద్రంలో కురుమూర్తి, నాగమణి దంపతులు నివసిస్తున్నారు. భార్య నాగమణి శ్రీకాంత్ అనే వ్యక్తితో వివాహేత బంధం పెట్టుకుంది. వీరిద్దరి మధ్య భర్త ఎందుకు? అని నాగమణి భావించింది. ఎలాగైనా అడ్డు తొలగించాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది.
Charlapally Dead Body: చర్లపల్లి ప్రాంతంలో మహిళ డెడ్ బాడీకి సంబంధించిన మిస్టరీ వీడింది. మృతురాలిని ప్రమీలగా గుర్తించారు. చంపి..డెడ్ బాడీని తీసుకు వచ్చి పడేసిన సీసీ ఫుటేజీ లభించింది. కానీ ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు హత్య చేశాడు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. చర్లపల్లి రైల్వే స్టేషన్. దీన్ని ఇటీవల అంతర్జాతీయ రైల్వే స్టేషన్ తరహాలో తీర్చిదిద్దారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాంటి నిఘా ఉన్న ప్రాంతంలోనే ఓ వ్యక్తి.. తాపీగా…
కూకట్‌పల్లి మైనర్ బాలిక మర్డర్ కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ కేసులో కొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో సహస్రాణి తల్లిదండ్రులను పోలీసులు విచారిస్తున్నారు. సహస్ర పేరెంట్స్ రేణుకా, కృష్ణలను విచారిస్తున్నారు. అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫ్యామిలీ హిస్టరీ, ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా ఇంటి సమీపంలో అనుమానితులు, పాత కక్షలు, కుటుంబ కలహాలు, గొడవలు ఎవరి పైన అయిన అనుమానం ఉందా? Also…
సంచలనం రేపిన కూకట్‌పల్లి మైనర్ బాలిక మర్డర్ కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. మర్డర్ జరిగి 24 గంటలు గడిచినా.. ఇప్పటి వరకు మిస్టరీ వీడలేదు. ఐతే ఈ కేసులో కొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. అంతే కాదు మర్డర్ జరిగిన ఇంటికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పూర్తిగా జల్లెడ పడుతున్నారు. అసలు సహస్రాణిని హత్య చేసిందెవరు? ఎందుకు బాలికను చంపేశారు? ఏ కారణంతో హత్యకు పాల్పడ్డారు? అనే విషయాలు తేలాల్సి ఉంది.…
Jagtial District: కొడుకంటే కష్టాలు కడతేర్చేవాడు.. కొడుకంటే కడుపున పెట్టుకొని కాపాడేవాడు.. కొడుకంటే ఇంటి బరువు మోసేవాడు.. కొడుకంటే ఇంటి పేరు నిలబెట్టేవాడు. మరి ఇక్కడ మాత్ర సీన్ రివర్స్ అయ్యింది. కర్కోటకుడిగా మారిన కొడుకు కన్న తండ్రినే దారుణంగా పొడిచేశాడు. 10 గుంటల భూమి కోసం ఈ ఘాతుకానికి పాల్పడి తండ్రీకొడుకుల బంధానికే కంట నీరు తెప్పించాడు. కని, పెంచి పెద్దచేసి ‘ప్రయోజకుడిని’ చేసినందుకు ప్రతిగా పేగుబంధమే వలవల ఏడ్చేలా చేశాడు. జగిత్యాల జిల్లా రాయికల్…
సంతానం లేని వారు సమాజంలో పలు రకాల ఇబ్బందులను ఎదుర్కుంటుంటారు. అయితే ఈ బాధలను తొలగించుకునేందుకు కొందరు ఐవీఎఫ్ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల కోసం వస్తున్న జంటలకు దిమ్మతిరిగే షాకిస్తున్నాయి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు. సొంత స్పెర్మ్ కాకుండా, పరాయి వ్యక్తుల స్పెర్మ్ తో సంతానం కలిగిస్తూ వారిని మరింత మానసిక క్షోభకు గురిచేస్తున్నారు కొందరు వైద్యులు. తాజాగా సికింద్రాబాద్ లో దారుణం వెలుగుచూసింది. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో…
హైదరాబాద్ సీపీఐ నాయకుడు చందు రాథోడ్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆర్ధిక విభేదాలు, వ్యక్తిగత కక్షల కారణంగానే హత్య జరిగినట్లు గుర్తించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. అటు మెదక్ జిల్లా కాంగ్రెస్ నేత అనిల్ హత్య కేసులోనూ ఫుల్ ఆధారాలు సేకరించారు పోలీసులు. ఆయనకు సన్నిహతంగా ఉన్న వ్యక్తులే సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు గుర్తించారు.