Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines At 5pm On 28th January 2025

Top Headlines @5PM: టాప్‌ న్యూస్‌!

Published Date :January 28, 2025 , 5:39 pm
By Sampath Kumar
Top Headlines @5PM: టాప్‌ న్యూస్‌!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

కష్టపడిన వారికే ప్రాధాన్యత:
2029లో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలని పార్టీ ముఖ్య నాయకులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ పని తీరును నిరంతరం పర్యవేక్షించుకుంటూ, మెరుగుపరుచుకుంటూ పనిచేయాలని సూచించారు. పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారిని ప్రోత్సహించాలని, పార్టీని నమ్ముకున్న వారికే పదవులు దక్కేలా చూసే బాధ్యత ఎమ్మెల్యేలదే అని సీఎం పేర్కొన్నారు. త్వరలో 214 మార్కెట్‌ కమిటీలు, 1100 ట్రస్ట్‌ బోర్డులకు నియామకాలు జరుగుతాయని చంద్రబాబు తెలిపారు. పార్టీ ముఖ్య నాయకులు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు, నేతల పనితీరు వంటి అంశాలపై సీఎం చర్చించారు.

సంపద సృష్టించడం అంటే.. ఉన్న ఆస్తులను పగలగొట్టడమా?:
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసకర పరిపాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని, దానికి పరాకాష్టగా వైసీపీ నేత బాలకృష్ణా రెడ్డి ఇంటిని కూలగొట్టడమే అని మండిపడ్డారు. సంపద సృష్టించడం అంటే.. ఉన్న ఆస్తులను పగలగొట్టడమా? అని ప్రశ్నించారు. పరిపాలన అంటే స్కూళ్లు, కాలేజీలను నిర్వహించడం కాదని మంత్రి నారాయణ తెలుసుకోవాలని కాకాని పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్‌లో నగరపాలక సంస్థ అధికారులు కూల్చిన వైసీపీ నేత బాలకృష్ణ రెడ్డి ఇంటిని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వైసీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జి చంద్ర శేఖర్ రెడ్డిలు పరిశీలించారు.

Also Read

  • Bangladesh: బెంగాల్‌లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
  • Karimnagar: హృదయ విదారక ఘటన.. తోపుడు బండిపై కుమారుడి శవాన్ని తీసుకెళ్లిన తండ్రి..
  • Punjab Blasts: పంజాబ్‌లో హైటెన్షన్.. గంటల వ్యవధిలో రెండు చోట్ల పేలుళ్లు.. ఇది ఖలిస్తానీ గ్రూపు పనే!
  • Vijay Deverakonda: విజయ్ దేవరకొండ సరసన కృతిసనన్..
Add as a preferred
source on google

సీపీ సంచలన విషయాలు:
తెలుగు రాష్ట్రాల్లో మీర్‌పేట్ హత్య కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే.. కాగా భార్య వెంకట మాధవిని భర్త గురుమూర్తి చంపినట్లు నిన్న పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో రాచకొండ సీపీ సుధీర్ బాబు సంచలన విషయాలు మీడియాకు తెలిపారు. 16వ తేదీ ఉదయం 8 గంటలకు నిద్రలేచిన వెంటనే మాధవి గురుమూర్తిల మధ్య గొడవ స్టార్ట్ అయిందని అన్నారు. గొడవ కావడంతో మాధవిని చంపాలని గురుమూర్తి అనుకున్నాడు.. అందుకోసమే ఆమెని కొట్టాడని సీపీ వెల్లడించారు. ఆమె చెంపపై కొట్టడంతో గోడకు తాకి కుప్పకూలిపోయింది.. వెంటనే ఆమె స్పృహ కోల్పోయినా, ఆమెను చంపాలన్న ఉద్దేశంతో ఆమె గొంతు పిసికి చంపాడని తెలిపారు. ఆ తర్వాత ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాడు.. ఆ తర్వాత మాధవి శరీరంపై ఉన్న బట్టలను తొలగించాడు.. మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకొని వెళ్ళాడు.. కిచెన్‌లో నుండి కత్తి తీసుకొని వచ్చాడని సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.

మహాత్మా గాంధీ యూనివర్సిటీకి కేటీఆర్:
మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నల్లగొండ రైతు ధర్నాకు వెళ్తున్న క్రమంలో కేటీఆర్‌ను ఆపిన యూనివర్సిటీ విద్యార్థులు తమ సమస్యలను వినతి పత్రంలో అందించారు. ధర్నా ముగించుకుని వెళ్లే సమయంలో యూనివర్సిటీకి వస్తానని హామీ ఇచ్చిన ఆయన.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంలో యూనివర్సిటీకి చేరుకున్నారు కేటీఆర్. యూనివర్సిటీ బయట విద్యార్థులను కలిసిన కేటీఆర్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ సమస్యలను, మెస్ ఛార్జీల పెంపు విషయంపై కేటీఆర్‌కు విద్యార్థులు వినతిపత్రం అందించారు. యూనివర్సిటీ లోపలికి వచ్చి తమ సమస్యలను తెలుసుకోవాలని విద్యార్థులు కేటీఆర్‌ను కోరాగా.. లోపలికి వస్తే విద్యార్థులపై కేసులు పెడతారని మరోసారి యూనివర్సిటీకి వస్తానని విద్యార్థులకు చెప్పారు కేటీఆర్.

ప్రజలకు క్వాలిటేటివ్ లైఫ్ అందించాలి:
దావోస్‌లో తెలంగాణకు పెట్టుబడుల వివరాలను సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రభుత్వ విధానాలపై ఒక నమ్మకం.. ముఖ్యమంత్రి, మంత్రివర్గంపై నమ్మకంతో వ్యాపారులు ముందుకు వచ్చారని శ్రీధర్ బాబు తెలిపారు. స్థిరమైన ప్రభుత్వం, దూరదృష్టి కలిగిన ప్రభుత్వం కావాలని వ్యాపార సంస్థలు కోరుకుంటాయి.. గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకంపై 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నాయని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఒక మెరుగైన వాణిజ్యం, వ్యాపారం స్టేట్‌గా ఎదగాలని ముఖ్యమంత్రి ఆలోచన అని మంత్రి పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే నాలుగు రెట్లు.. అంటే 1లక్షా 79 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందం చేసుకున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

గ్రీకు యువతి-భారతీయ కుర్రాడిని ఒక్కటి చేసిన కుంభమేళా:
మహా కుంభమేళాలో వింతలు జరుగుతున్నాయి. దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు 15 కోట్ల మందికిపైగా స్నానాలు ఆచరించి రికార్డ్ సృష్టించారు. ఇదంతా ఒకెత్తు అయితే.. ఒక గ్రీకు యువతి-యూపీ కుర్రాడిని వివాహం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇలా కుంభమేళా వింతలకు వేదిక అవుతోంది. యూపీకి చెందిన సిద్ధార్థ్ అనే కుర్రాడు, గ్రీస్‌కు చెందిన పెనె‌లోప్ అనే యువతి.. ఇద్దరూ ఇష్టపడ్డారు. దీంతో ప్రయాగ్‌రాజ్‌లో సాంప్రదాయ వైదిక ఆచారాలు అనుసరించి వివాహం చేసుకున్నారు. వధువు కుటుంబం కన్యాదానం చేసింది. వివాహం అనంతరం స్వామి యతీంద్రానంద గిరి ఆశీర్వాదాలు తీసుకున్నారు. పెనెలోప్‌ మాట్లాడుతూ.. తాను ఇంతకు ముందు భారతదేశంలో జరిగే వివాహానికి హాజరు కాలేదని తెలిపింది. తాను పెళ్లి చేసుకునే సమయంలో కొంత దైవిక శక్తి గ్రహించినట్లు తెలిపింది. ఇక పెనెలోప్‌ బౌద్ధమతం నుంచి హిందూ మతంలోకి మారినట్లు తెలిపింది. జనవరి 29న గంగా నదిలో పవిత్ర జలంలో పుణ్యస్నానం ఆచరిస్తానని తెలిపింది.

ట్రంప్ దారిలోనే కెనడా:
డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత నుంచి అక్రమ వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. అమెరికాలో అక్రమంగా డాక్యుమెంట్లు లేకుండా నివసిస్తున్న వారిని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ బహిష్కరిస్తోంది. ఇప్పుడు కెనడా కూడా అదే దారిలో వెళ్లేందుకు సిద్ధమవుతోంది. కెనడా లిబరల్ పార్టీ తరుపున ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఉన్న భారత సంతతికి చెందిన రూబీ ధల్లా కూడా, తాను ప్రధానిగా ఎన్నికైతే అక్రమ వలసదారుల్ని కెనడా నుంచి బహిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ధల్లా 004 నుండి 2011 వరకు బ్రాంప్టన్-స్ప్రింగ్‌డేల్ నుండి ఎంపీగా ఉన్నారు. అక్టోబర్ 2025 కెనడా ఎన్నికల్లో గెలిస్తే జస్టిన్ ట్రూడో స్థానంలో ధల్లా లిబరల్ పార్టీ నాయకురాలిగా, కెనడా ప్రధాని అభ్యర్థిగా అధికారికంగా పోటీలో దిగారు.

సుంకాల విషయంలో భారత్‌కి ట్రంప్ వార్నింగ్:
డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో పాటు అధికంగా సుంకాలు విధించే దేశాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా ట్రంప్ భారత్, చైనా, బ్రెజిల్‌లను ఉద్దేశిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మూడు దేశాలను ‘‘అత్యంత సుంకాల తయారీదారులు’’గా అభివర్ణించారు. తమ ప్రభుత్వం ఈ మూడు దేశాలను ఈ మార్గంలోనే కొనసాగించడానికి అనుమతించదని, ఆమెరికాని మొదటిస్థానంలో ఉంచబోతున్నాము కాబట్టి ఇకపై అలా జరగనవ్వబోము అని ప్రకటించారు.

ఎక్స్ పీరియంలో తొలి షూటింగ్ నాదే:
చిలుకూరులోని ప్రొద్దుటూరు వెస్ట్రన్ సెంటర్‌లో రామడుగు రాందేవ్ రావు ఎక్స్‌పీరియం పార్క్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు, సీఎం రమేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాందేవ్‌తో నా పరిచయం ఇప్పటిది కాదు. ఈ ఎక్స్‌పీరియం పార్కుని మీ అందరి కంటే ముందుగా నేను చూశా, 2000వ సంవత్సరంలోనే దీని గురించి రాందేవ్ నాతో పంచుకున్నారు. 2002 నుంచి నేను కూడా రాందేవ్ వద్ద నుంచి మొక్కల్ని తెప్పించుకుంటూనే ఉన్నా. మా ఇంట్లో ఉండే అనేక రకాల మొక్కలు, చెట్లు రాందేవ్ వద్ద నుంచి వచ్చినవే. రాందేవ్‌ ఓ వ్యాపారవేత్తగా ఎప్పుడూ ఆలోచించరు. పర్యావరణం, ప్రకృతి గురించి ఆలోచిస్తుంటారు. ఈ 150 ఎకరాలను వాణిజ్యంగానూ వాడుకోవచ్చు.

సైలెంటుగా పని మొదలెడుతున్న యంగ్ టైగర్:
జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో ఊహించని విజయాన్ని అందుకున్నాడు. నిజానికి ఆ విజయాన్ని ఊహించారు కానీ ఆ ఊహకు మించి కలెక్షన్స్ అయితే వచ్చాయి. అయితే ఆయనకి ఇప్పటివరకు సోలో హీరోగా 1000 కోట్ల సినిమా ఒకటి కూడా లేదు. ఆర్ఆర్ఆర్ సినిమా ఉన్నా సరే రాజమౌళితో పాటు రామ్ చరణ్ కి కూడా క్రెడిట్ ఇవ్వాలి. కాబట్టి ఆయన సింగిల్ వెయ్యికోట్ల సినిమా కోసం అభిమానులు విపరీతంగా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి దేవర తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు కానీ ఎన్టీఆర్ నీల్ అనే హ్యాష్ ట్యాగ్ తో రిఫర్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ వచ్చేవారం మొదలు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి ఈ రోజే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాల్సి ఉంది కానీ పలు కారణాలతో సినిమా షూటింగ్ ఈరోజు అయితే ప్రారంభం కాలేదు. వచ్చేవారం నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి ఈ ఏడాది చివరిలోపు రిలీజ్ చేసే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.

దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా ఏబీ డివిలియర్స్‌:
క్రికెట్ అభిమానులకు శుభవార్త. దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్‌ నాలుగు సంవత్సరాల తర్వాత బ్యాట్ పట్టేందుకు సిద్దమయ్యాడు. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ (డబ్ల్యూసీఎల్‌) టోర్నీలో తాను బరిలో దిగనున్నట్లు ఏబీడీ స్వయంగా ప్రకటించాడు. అంతేకాదు డబ్ల్యూసీఎల్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు తెలిపాడు. డబ్ల్యూసీఎల్‌ రెండవ ఎడిషన్‌లో గేమ్ ఛేంజర్స్ సౌతాఫ్రికా ఛాంపియన్స్‌కు ఏబీడీ నాయకత్వం వహిస్తాడు. తాను మైదానంలోకి బరిలోకి దిగుతున్నట్లు మిస్టర్ 360 ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు సంతోషపడిపోతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap news
  • ntv
  • ntv news
  • telangana news
  • Top Headlines 5PM

తాజావార్తలు

  • Bangladesh: బెంగాల్‌లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..

  • Congress TVK Alliance: మారిపోయిన తమిళ అధికార పక్షం మ్యాప్.. టీవీకే క్లీన్ స్వీప్.. డీఎంకే-కాంగ్రెస్ దోస్తీకి ‘ది ఎండ్’?

  • Salman Khan: బాలీవుడ్ హిట్ జోడీ మళ్ళీ రిపీట్..

  • Star Hero’s: ఈ ముగ్గురు లెజెండ్స్ రాజకీయాల్లో ఎందుకు నిలబడలేకపోయారు? 

  • Redmi Watch 6: కొత్త Redmi Watch 6 లాంచ్.. AMOLED డిస్‌ప్లే, GPS ఫీచర్లతో అదిరింది

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions